Night Curfew: నైట్ కర్ఫ్యూ విధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం
Night Curfew: దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఈ నేఫధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
Night Curfew: దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఈ నేఫధ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్(Corona second wave) కోరలు చాస్తూ భయంకరంగా విస్తరిస్తోంది. కరోనా కేసుల సంఖ్య ప్రతిరోజూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2 లక్షల పైచిలుకు కేసులు నమోదు కాగా..తెలంగాణలో 3 వేల 5 వందల కేసులు వెలుగు చూశాయి. తెలంగాణ(Telangana)లో గత కొద్దిరోజులుగా కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. కరోనా వైరస్ కట్టడి కోసం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే నైట్ కర్ఫ్యూ( Night curfew in telangana) విధించే యోచనలో ఉన్నట్టు సమాచారం.
ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కరోనా కట్టడికి రాత్రి పూట కర్ఫ్యూ( Night Curfew) అమలు చేయాలని ప్రదాని నరేంద్ర మోదీ ( Pm modi) సూచించారు. ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, యూపీ లాంటి రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలవుతోంది. ఇప్పుడు తెలంగాణ కూడా అదే దారిలో పయనించనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని శాఖల ముఖ్య అధికారులతో సమీక్షిస్తున్నారు. అన్ని శాఖల అధికారులతో కేసీఆర్(KCR) సమావేశమై..తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Also read: COVID-19: తెలంగాణలో భారీగా పెరుగుతున్న కరోనా మరణాలు, తాజాగా 3,307 కోవిడ్19 కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook