Night Curfew in Telangana: గత రెండేళ్లుగా ప్రపంచాన్ని కొవిడ్‌ మహమ్మారి కలవరపరుస్తూనే ఉంది. ఈ ఏడాది కూడా కొవిడ్‌ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ జనాన్ని హడలెత్తిస్తోంది. దేశంలోనే రోజూ లక్షలాది మంది కొవిడ్ (Covid) బారిన పడుతూ ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే కేసులు భారీగా నమోదవుతుండడం వల్ల దేశంలో పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు అవుతోంది. వీకెండ్ లాక్‌డౌన్ కూడా అమలు చేస్తున్నారు. ఇక ఏపీలో కూడా పదివేలకు పైగా రోజువారీ కేసులు నమోదు అవుతుండడంతో కొద్దిరోజులుగా అక్కడ కూడా నైట్ కర్ఫ్యూ (Night Curfew) అమలు చేస్తున్నారు.


ఇక తెలంగాణలో రోజూ 4వేలకు దాకా కేసులు నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అలాగే కొవిడ్ పాజిటివిటీ రేట్ 10శాతం దాటితే నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందంటూ తాజా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇక తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర కూడా ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. ఈ జాతరకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారు.


Also Read: Drugs case: హైదరాబాద్​లో డ్రగ్స్​ కేసు కలకలకం- వెలుగులోకి వ్యాపారుల పేర్లు!


అయితే ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా భక్తులు భారీ ఎత్తున వస్తారు కాబట్టి కొవిడ్ నిబంధనలు పాటించడం అసాధ్యంగా అనిపిస్తోంది. మేడారం జాతర తర్వాత కొవిడ్ కేసులు (Covid) సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందంటూ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పిన లెక్కల ప్రకారం, మేడారం జాతర తర్వాత తెలంగాణలో (Telangana) నైట్ కర్ఫ్యూ అమలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


Also Read: AP New Districts News: "పీఆర్సీ, క్యాసినోలను పక్కదారి పట్టించేందుకే ఈ జిల్లాల ప్రతిపాదన"


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook