మిడతల దండుపై తెలంగాణ దండయాత్ర..!!
మిడతల దండయాత్ర నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇప్పుడు వాటి నుంచి పంటలను కాపడానికి ఉన్న అన్ని ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తోంది. పరిమాణంలో చిన్నగా కనిపించినా మిడతలు పంటలపై పడితే మాత్రం పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి.
మిడతల దండయాత్ర నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇప్పుడు వాటి నుంచి పంటలను కాపడానికి ఉన్న అన్ని ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తోంది. పరిమాణంలో చిన్నగా కనిపించినా మిడతలు పంటలపై పడితే మాత్రం పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి.
నిపుణుల ప్రకారం.. మిడతల డండు ఒక్క రోజు ఆరగించే పంటతో సుమారు 35 వేలమందికి ఆహరం అందించవచ్చు. కరోనా ముప్పుతో పాటు మానవాళికి కొత్త ఆపదగా మారిన మిడతల దండు ఎన్నో దేశాల నుంచి ప్రయాణిస్తూ వస్తోంది. ఆఫ్రికా నుంచి ఇరాన్, పాకిస్తాన్ తరువాత అవి భారత దేశంలోకి ప్రవేశించాయి.
మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు కరోనాతో పాటు భారత దేశం మిడతలతో కూడా పోరాడాల్సి వస్తోంది. తాజా సమాచారం ప్రకారం మిడతల దండు వేగంగా తెలంగాణ గగనతలంలోకి ప్రవేశిస్తున్నాయని..వాటి వల్ల వేల ఎకరాలకు ముప్పు పొంచి ఉన్నట్టు తెలుస్తోంది.
మహారాష్ట్ర నుంచి అవి అదిలాబాద్, నిజామాబాద్ మీదుగా తెలంగాణలోకి మిడతలు ప్రవేశించనున్నాయని తెలియగానే రైతుల్లో కలవరం మొదలైంది. తమ పంటలను ఎలా కాపాడుకోవాలోనని దిగులు పడుతున్నారు. ఇది గమనించిన తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మిడతలపై దండయాత్ర చేయాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో వ్యవసాయ నిపుణులు కూడా మిడతల దండు నుంచి విముక్తి పొందవచ్చని.. కంగారు పడాల్సిన అవసరం లేదన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు వారు కొన్ని సూచనలు కూడా జారీ చేశారు.
మిడతల దండుపై దండయాత్ర ఇలా..
* మిడతలు భారీ శబ్దాలకు చెదిరిపోతాయి. అందుకే లౌడ్ స్పీకర్లు ప్లే చేయడం, లేదా రేడియోలు ప్లే చేయడం, ఇతర పరికరాలతో చప్పుడు చేయడం చేయాలి.
* మిడతలు గుడ్లు పెట్టాయి అని తెలిస్తే వెంటనే పిల్ల పురుగులను నాశనం చేయడానికి క్వినోల్ ఫాస్ పౌడర్‌ను
*అదే విధంగా ఎండిన పొలాల్లో మంట పెట్టడం ద్వారా కూడా మిడతలను నాశనం చేయవచ్చు. ఆ మంటలకు మిడతలు కాలిపోయి చనిపోతాయి.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..