Covid Treatment Charges: కరోనా మహమ్మారి నియంత్రణకై తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకు అడ్డుకట్ట వేస్తోంది. నిర్ధిష్టమైన ధరల్ని ఖరారు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)ఉధృతి దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టింది. తెలంగాణలో సైతం కేసులు గణనీయంగా తగ్గడంతో ప్రభుత్వం లాక్‌డౌన్(Lockdown)కూడా తొలగించింది. కరోనా నియంత్రణలో భాగంగా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కరోనా చికిత్స పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీ చేయకుండా నిర్ధిష్టమైన ధరల్ని ఖరారు చేసింది. 


రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స, నిర్ధారణ పరీక్షలకు ధరల్ని తెలంగాణ ప్రభుత్వం (Telangana government) ఖరారు చేసింది. ఈ మేరకు కరోనా చికిత్సల ఛార్జీలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జీవో నెంబర్ 40 విడుదల చేసింది. కోవిడ్ సోకి సాధారణ వార్డులో ఐసోలేషన్, పరీక్షలకు రోజుకు గరిష్టంగా 4 వేలు మాత్రమే వసూలు చేయాలి. ఐసీయూలో అయితే రోజుకు గరిష్టంగా 7 వేల 5 వందల రూపాయలు ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అదే వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూలో రోజుకు గరిష్టంగా 9 వేల రూపాయలు తీసుకోవాలి. పీపీఈ కిట్ ధర 273 రూపాయలు మించకూడదు.హెచ్‌ఆర్‌సిటీ స్కాన్‌కు 1995 రూపాయలు, డిజిటల్ ఎక్స్ రే 13 వందల రూపాయలు, ఐఎల్6 కు 13 వందల రూపాయలు మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది.


ఇక కీలకమైన డీ డైమర్ పరీక్షకు 3 వందలు, సీఆర్‌పీకు 5 వందలు, ప్రొకాల్ సీతోసిన్ పరీక్షకు 14 వందల రూపాయలు,ఫెరిటిన్‌కు 4 వందల రూపాయలు, ఎల్‌డీహెచ్‌కు 140 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణ వ్యవస్థ కలిగిన అంబులెన్స్‌కు కిలోమీటర్‌కు 75 రూపాయలు కాగా..కనీసం 2 వేల రూపాయలుగా నిర్ణయించింది. అదే ఆధునిక జీవనాధార వ్యవస్థ కలిగిన అంబులెన్స్‌కు కిలోమీటర్‌కు 125 రూపాయలు కాగా..కనీస ధర 3 వేలుగా నిర్ధారించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల (Corona treatment Charges)కంటే ఎక్కువ వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. 


Also read: No Vaccine No Salary: వ్యాక్సిన్ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులకు నో శాలరీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook