No Vaccine No Salary: కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది.
కరోనా వైరస్ (Corona virus) కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు(Vaccination Drive) పటిష్టంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ కేంద్రాల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వ్యాక్సిన్ అందిస్తున్నారు.వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో సంచలన ప్రకటన చేశారు. ఉజ్జయిని జిల్లా కార్యాలయం వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine) వేయించుకుంటేనే జూలై నెల జీతం ప్రభుత్వ ఉద్యోగులకు అందుతుందని ఉజ్జయిని జిల్లా కలెక్టర్ ఆశీష్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు జూలై 31 లోగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోకపోతే ఆ నెల జీతం పంపిణీ కాదని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టుగా వ్యాక్సిన్ సర్టిఫికేట్ అందజేయాల్సి ఉంటుంది. జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ కోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని..ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఆశీష్ సింగ్ తెలిపారు.జూన్ నెలకు జీతాల పంపిణీతో పాటు వ్యాక్సిన్ సర్టిఫికేట్లు సేకరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా అందాయి.
Also read: COVID-19 New Wave: కరోనా కొత్త వేవ్ ఏర్పడేందుకు దారితీసే 4 పరిస్థితులు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook