Congress Government: కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్ , అమరుల్లా ఖాన్ లను ఎంపిక చేసి, గవర్నర్ తమిళిసై ఆమోదానికి సిఫారసు చేశారు.  తాజాగా, తమిళిసై ఈ సిఫారసులకు ఆమోదం తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విద్యావేత్త ప్రొఫెసర్ ను ఎమ్మెల్సీగా నియమిచడం పట్ల అనేక మంది తెలంగాణ ఉద్యమ కారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావేత్తకు సముచిత స్థానం కల్పించిందని కూడా చెబుతున్నారు. అయితే.. తెలంగాణలో గతంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం..  దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది.


కానీ నిబంధనలమేరకు వీరిని ఎమ్మెల్సీలుగా ఆమోదించలేమని గవర్నర్ లేఖరాసిన విషయం తెలిసిందే. మరోవైపు  టీఎస్పీస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని, సభ్యుల నియామకానికి కూడా గవర్నర్ తమిళిసై గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 


Read Also: TSPSC: కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ పోలీసు బాస్..
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook