Seating Capacity In Cinema Theatres and Multiplexes:  సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు ఇక నుంచి ప్రేక్షకులతో కిటకిటలాడనున్నాయి. వంద శాతం సీటింగ్ ప్రేక్షకులతో సినిమా థియేటర్లు కొనసాగించవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో గత ఏడాది మార్చి నెలలో సినిమా థియేటర్లు, మల్లీప్లెక్స్‌లు మూతపడ్డాయి. ఇటీవల కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


తాజాగా పూర్తి స్థాయిలో 100 శాతం సీటింగ్ కెపాసిటితో సినిమా హాల్స్, మల్టీప్లెక్స్‌లు నిర్వహించుకోవచ్చునని తెలంగాణ సర్కార్ స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. కేంద్ర స‌మాచార‌, ప్రసారాల మంత్రిత్వ శాఖ‌ కొత్త మార్గద‌ర్శకాల‌ ప్రకారం తెలంగాణ(Telangana) ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Also Read: Tollywood మహానటి Keerthy Suresh ఖాతాలో అరుదైన ఘనత, Forbes జాబితాలో చోటు 


 



 


కాగా, గత అక్టోబర్ నుంచి తెరుచుకున్న Tollywood థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు 50 శాతం సీట్లతో నడుస్తున్నాయి. ప్రస్తుతం మొత్తం సీట్లకు టికెట్లు జారీ చేసుకునే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించడంతో థియేటర్ల, మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Photos Of Iswarya Menon: అందాల భామ ఐశ్వర్య మీనన్ క్యూట్ ఫొటోస్


 


పూర్తి స్థాయిలో మొత్తం సీట్లు ప్రేక్షకులతో నిండిపోయినా కోవిడ్-19 నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సిందేనని తమ ఉత్తర్వులలో సర్కారు పేర్కొంది. శానిటైజర్ వాడకం, మాస్కులు ధరించడం లాంటివి మరికొన్ని రోజులు యథాతథంగా కొనసాగనున్నాయి.  ఏది ఏమైతేనేం తమకు పూర్తి అవకాశాన్ని కల్పించడంపై థియేటర్ల యాజమాన్యాలు సంతోషంగా ఉన్నాయి.


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook