Tollywoodలో మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన Anchor Anasuya, మూవీ యూనిట్ ప్రకటన

Anchor Anasuya Latest Updates : ఓ వైపు బుల్లితెరపై తనకంటూ గుర్తింపును తెచ్చుకుంది యాంకర్ అనసూయ భరద్వాజ్. మరోవైపు సోషల్ మీడియాలో ఫొటోషూట్‌లతో కవ్విస్తుంటుంది. తాజాగా మరో సినిమాలో క్రేజీ ఆఫర్ అందుకుంది నటి అనసూయ. మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2021, 04:26 PM IST
  • బుల్లితెర మీద స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్
  • మరోవైపు వెండితెర మీద సైతం మెరుపులు మెరిపిస్తున్న నటి అనసూయ
  • తాజాగా వరుస సినిమా ఆఫర్లు యాంకర్ అనసూయకు క్యూ కడుతున్నాయి
Tollywoodలో మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన Anchor Anasuya, మూవీ యూనిట్ ప్రకటన

Anchor Anasuya In Khiladi Movie: టాలీవుడ్‌లో స్వశక్తితో ఎదిగిన నటుడు రవితేజ ‘క్రాక్’ మూవీ సక్సెస్ తరువాత నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఖిలాడి’. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ఆఫర్‌ కొట్టేసింది. ఓ బుల్లితెర మీద రాణిస్తూనే వెండి తెరపై తళుక్కున మెరిసే భామ అందాల అనసూయ.

 

లేడి ఓరియెంటెడ్‌ మూవీలకు సైతం ఓకే చెబుతున్న అనసూయ తాజాగా ఖిలాడీ మూవీకి ఓకే చెప్పేసింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో యాంకర్‌, నటి అనసూయ కనిపించనుంది. అనసూయను ఆహ్వానిస్తూ మూవీ యూనిట్‌ ట్వీట్‌ చేసింది. దీంతో ఖిలాడిలో అనసూయ(Anchor Anasuya Latest News) నటించనున్నారని అధికారికంగా ప్రకటన వచ్చినట్లయింది.

Also Read: Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్ లేని దేశాలు కూడా ఉన్నాయి, No Income Tax దేశాలు ఇవే

 

 

 

ఖిలాడి మూవీలో అనసూయ గేమ్‌ ఛేంజర్‌ అంటూ హింట్‌ కూడా ఇచ్చేసింది మూవీ యూనిట్‌. థ్రిల్లర్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, ఉన్ని ముకుందన్‌ కీలకపాత్రలు పోషించారు. మాస్‌ మహారాజా రవితేజ(Actor Ravi Teja Latest Updates) సరసన డింపుల్‌ హయతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

Also Read: Mahesh Babu: ట్రెండ్ క్రియేట్ చేస్తున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు

పెన్ స్టూడియోస్, హ‌వీష్ ప్రొడ‌క్షన్స్ సంయుక్తంగా ఖిలాడి సినిమాను నిర్మిస్తున్నారు. మే నెలలో వేసవి కానుకగా సినిమాను తీసుకొచ్చేందుకు మూవీ యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చుతున్నాడు. 

Also Read: Krack movie తర్వాత భారీగా Remuneration పెంచిన Raviteja 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News