Chandrayaan-3 Live Streaming Date and Time : చంద్రయాన్-3 అద్భుతమైన ఘట్టానికి కళ్లారా వీక్షించేందుకు ఇంకొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. చంద్రుడిపై మన దేశ అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండింగ్ కానుంది. దీంతో ప్రస్తుతం మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చంద్రయాన్ 3 ల్యాండింగ్‌పై భారీ ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ అద్భుత దృశ్యాన్ని తెలంగాణలోని ప్రతీ విద్యార్థి చూడాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీలు అనే తేడా లేకుండా అన్ని విద్యా సంస్థల్లో చంద్రయాన్-3 ల్యాండింగ్ ఘట్టానికి సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ కు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖకు సూచించింది. ఈ మేరకు డీఈవోలు, ప్రిన్సిపల్స్ కు స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వం ఆదేశాలతో తెలంగాణ విద్యా ఛానెల్స్ టీశాట్, నిపుణలో లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక స్క్రీన్లు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు చూపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం 5.20 గంటలకు టీశాట్, నిపుణ ఛానెళ్లలో లైవ్ ప్రారంభం అవుతుంది. 


ఇదిలావుంటే, విద్యార్థులకు ఈ దృశ్యాన్ని చూపించడం కోసం విద్యా సంస్థల పనివేళలు సాయంత్రం 6. 30 గంటల వరకు పొడిగించినట్టు తెలియరాగా తాజాగా స్కూల్ టైమింగ్స్‌పై విద్యా శాఖ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. చంద్రయాన్ టెలికాస్ట్ కోసమని పాఠశాలలని 6.30 గంటల వరకు కొనసాగించాల్సిన అవసరం లేదని విద్యా శాఖ స్పష్టంచేసినట్టు సమాచారం అందుతోంది. రెసిడెన్షియల్ స్కూల్స్ లో విద్యార్థులకు ప్రొజెక్టర్స్ / కె యాన్ / టీవీ ల ద్వారా చూపించండి అని స్పష్టంచేసిన విద్యా శాఖ... మిగతా పాఠశాలల విద్యార్థులు ఇంటి వద్ద టీవీలో కాని లేదా మొబైల్‌లో కానీ వీక్షించాల్సిందిగా వారికి అవగాహన కల్పించండి అని తేల్చిచెప్పింది. 


ఇది కూడా చదవండి : Chandrayaan 3 Updates: సరికొత్త చరిత్రకు చేరువలో భారత్.. చంద్రయాన్-3 లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!


ఒకవేళ బుధవారం సాయంత్రం లైవ్‌లో ఈ దృశ్యాన్ని చూడలేకపోయిన పక్షంలో ఆ తర్వాతి రోజున పాఠశాల సమయంలోనే విద్యార్థులకు పాఠశాలలో ఈ దృశ్యాన్ని చూపించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా విద్యా శాఖ సంబంధిత అధికారులకు సూచించింది. అంతేకానీ మిషన్ చంద్రయాన్ 3 ని చూపించడం కోసం విద్యార్థులను పాఠశాలల నుండి బయటకి తీసుకెళ్లరాదని స్పష్టంచేసింది.


ఇది కూడా చదవండి : Chandrayaan 3 Live Streaming: చంద్రయాన్ 3 ల్యాండింగ్ సమయం ప్రకటన, ప్రత్యక్ష ప్రసారం ఎన్ని గంటలకు ఎందులో చూడవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి