Lockdown in Telangana : తెలంగాణలో లాక్‌డౌన్ 4.0 సడలింపులు ఇవే
తెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఉన్న కంటైన్‌మెంట్ జోన్స్ మినహా మిగతా అన్ని జోన్లను గ్రీన్ జోన్స్ గానే పరిగణించనున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. గ్రీన్ జోన్లలో సడలింపులు ఉన్నప్పటికీ.. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కఠినమైన నిబంధనలతో లాక్‌డౌన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు.
హైదరాబాద్ : తెలంగాణలో మే 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఉన్న కంటైన్‌మెంట్ జోన్స్ మినహా మిగతా అన్ని జోన్లను గ్రీన్ జోన్స్ గానే పరిగణించనున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. గ్రీన్ జోన్లలో సడలింపులు ఉన్నప్పటికీ.. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం కఠినమైన నిబంధనలతో లాక్‌డౌన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. గతంలో ఈ నెల 29 వరకే లాక్‌డౌన్ విధించాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు పేర్కొన్నారు.
గ్రీన్ జోన్లలో సడలింపులు ఇలా..
కరోనా ప్రభావం కొనసాగుతున్న కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగతా గ్రీన్ జోన్లలోని అన్ని దుకాణాలు తిరిగి ప్రారంభించుకోవచ్చునని తెలిపారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టిఎస్ఆర్టీసీ సేవలు అందించనున్నట్టు ప్రకటించడం ద్వారా రోడ్డు రవాణా సదుపాయం కోసం వేచిచూస్తున్న వారికి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. అయితే, హైదరాబాద్‌లో సబర్బన్ బస్సు సర్వీసులు అందుబాటులో ఉండవని అన్నారు.
క్యాబ్స్, ఆటోలకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్... అటోలలో 1+2 చొప్పున అనుమతి ఉండగా.. ట్యాక్సీ, కార్లలో 1+3 చొప్పున అనుమతి కల్పిస్తున్నట్టు చెప్పారు. కర్ఫ్యూ విషయానికొస్తే.. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో లాక్‌డౌన్ సడలింపులపై త్వరలోనే ప్రకటన చేయనున్నట్టు సీఎం కేసీఆర్ తెల్చిచెప్పారు.
ఇంకొన్ని ముఖ్యాంశాలు..
హైదరాబాద్ మెట్రో రైల్వే సర్వీస్‌కి అనుమతి లేదు.
కంటైన్మెంట్ జోన్లు మినహా... మిగతా జోన్లలో ఉన్న సెలూన్లు, దుకాణాలు తెరుచుకోవచ్చు.
ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులకు అనుమతి లేదు.
ఆన్‌లైన్ షాపింగ్ సేవలు అందించే ఈ కామర్స్ సంస్థలకు గ్రీన్ సిగ్నల్.
ప్రజలు సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం తప్పనిసరి. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా, కఠినచర్యలు జరిమానా.