Free Rice Distribution in Telangana: తెలంగాణలో ఎట్టకేలకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోలకు తోడు మరో ఐదు కిలోలు కలిపి ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయనుంది. కుటుంబంలో ఎంతమంది ఉంటే.. అంతమందికి 10 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాంకేతిక కారణాలతోనే ఏప్రిల్, మే నెలల్లో ఉచిత రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయలేకపోయామని మంత్రి గంగుల తెలిపారు. ఈ నెల 18 నుంచి 26 వరకు ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఉంటుందన్నారు. డిసెంబర్ వరకు ఉచిత రేషన్ పంపిణీ ఉంటుందన్నారు.


కరోనా కాలంలో పేద ప్రజలను ఆదుకునేందుకు ఏప్రిల్, 2020న కేంద్రం ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అర్హులైన లబ్దిదారులకు ఈ పథకం ద్వారా 5 కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందించింది. కరోనా కారణంగా వరుస లాక్‌డౌన్‌లు పెట్టాల్సిన పరిస్థితి రావడంతో ఈ పథకాన్ని కేంద్రం పొడగిస్తూ వచ్చింది. ప్రస్తుత సంవత్సరంలో మార్చి నెల నుంచి మరో ఆర్నెళ్ల పాటు ఈ పథకాన్ని అమలుచేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. గరీబ్ కల్యాణ్ అన్న యోజనా పథకం కింద అర్హులైన పేదలందరికీ ఉచిత బియ్యం అందించనున్నారు.


కేంద్రం తమ కోటా కింద ఇచ్చే 5 కిలోలకు మరో 5 కిలోలు కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలుచేయనుంది. ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ద్వారా రాష్ట్రంలో దాదాపు 2.87 కోట్ల మందికి లబ్ది చేకూరనుంది. 


Also Read: Gang Rape Case Update: గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల సంచలనం.. మైనర్లను మేజర్లుగా పరిగణించాలని జూవైనల్ జస్టిస్ బోర్డుకు వినతి


Also Read: Balakrishna Birthday: బాల‌కృష్ణ అభిమానుల‌కు డ‌బుల్ బొనాంజా.. 'ఎన్‌బీకే 107' టైటిల్, టీజర్‌కి టైమ్ ఫిక్స్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook