Free COVID19 Tests In Telangana | రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుతపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ మెడికల్ సెంటర్లలో కోవిడ్19 టెస్టులు, కరోనా పేషెంట్లకు చికిత్సన ఉచితంగా అందించాలని సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయం తీసుకున్నారు. ముందుగా మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీలలో కరోనా టెస్టులు, చికిత్స అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. CBSE టెన్త్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా హైదరాబాద్, జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే ప్రైవేట్ మెడికల్ ఆస్పత్రులు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో కోవిడ్19 టెస్టులతో పాటు పేషెంట్లకు చికిత్సను ఉచితంగా (Free Corona Treatment In Telangana) అందించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎం కేసీఆర్, వైద్యశాఖ ఉన్నతాధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సేవలను మరిన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులకు విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. Depression: ఈ యోగాసనాలతో డిప్రెషన్ పరార్!


కాగా, తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 37,745కి చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 375కు చేరడం తెలిసిందే.  భారత్‌లో 24వేలు దాటిన కరోనా మరణాలు