సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి ఫలితాలు (CBSE Class 10 Exam Result 2020) వచ్చేశాయ్. ముందుగా చెప్పినట్లుగానే టెన్త్ ఫలితాలను బుధవారం నాడు సంబంధిత మంత్రిత్వశాఖ అధికారులు విడుదల చేశారు. ఫలితాలను విద్యార్థుల కోసం అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచారు. సీబీఎస్‌ఈ విద్యార్థులు ఫలితాల (CBSE 10th Result 2020)ను ఈ కింది లింక్స్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
వెబ్‌సైట్ 1
వెబ్‌సైట్ 2
వెబ్‌సైట్ 3
గతేడాది ఉత్తీర్ణత శాతం 91.10 ఉండగా, ఈ ఏడాది 91.46 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 2019తో పోలిస్తే ఈ ఏడాది 0.36శాతం విద్యార్థులు అధికంగా ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 18,73,015 మంది CBSE విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 17,13,121 మంది టెన్త్ క్లాస్ పరీక్షలు పాసయ్యారు. త్రివేండ్రమ్ 99.28శాతంతో అగ్రస్థానాన్ని సాధించగా, గువాహటిలో అత్యల్పంగా 79.12శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణలయ్యారు.
cbseresults.nic.in , cbse.nic.in , cbse.nic.in ఈ లింక్స్ మీద క్లిక్ చేసి విద్యార్థులు రిజల్ట్స్ చూసుకోవచ్చనని అధికారులు తెలిపారు.
సీబీఎస్ఈ టెన్త్ విద్యార్థులు తమ ఫలితాలను (CBSE Class 10 Exam Result 2020)ను Umang App, ఐవీఆర్ఎస్ ద్వారా, డిజిలాకర్ యాప్ (digilocker.gov.in) లో, డిజిరిజల్ట్స్ యాప్‌లలోనూ తెలుసుకోవచ్చు.
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
CBSE టెన్త్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి