గుడ్ న్యూస్: `దళితబంధు` అమలుకు కేసీఆర్ సర్కారు గ్రీన్ సిగ్నల్.. రూ.500 కోట్లు విడుదల
హుజూరాబాద్ నియోజకవర్గానికి దళిత బంధు నిధులు విడుదల చేస్తూ....కేసీఆర్ సర్కారు ఉత్తర్వులిచ్చింది. దీని కింద రూ.500 కోట్లు విడుదల చేసింది.
Dalit Bandhu: హుజురాబాద్ నియోజకవర్గంలో 'దళితబంధు' అమలుకు కేసీఆర్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పథకం కింద రూ.500 కోట్లు విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. కాగా హుజురాబాద్ (Huzurabad) లో ‘దళిత బంధు(Dalit Bandhu )’ పైలెట్ ప్రాజెక్టును నిలుపుదల చేయాలంటూ జనవాహిని పార్టీ, జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీ హైకోర్టు(High Court)లో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Also Read:'దళితులను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలి'...తమిళ నటి సంచలన కామెంట్స్
ఉప ఎన్నిక కారణంగా.. హుజురాబాద్Huzurabad) లో పైలట్ ప్రాజెక్టు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ(EC)తో పాటు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ, భాజపా, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(CM KCR) తదితరులను పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దళితబంధు అమలుకు ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.
తొలుత సీఎం కేసీఆర్( CM KCR) దత్తతగ్రామమైన వాసాలమర్రి(Vasalamarri)లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆ పంచాయతీలో ఉన్న 76 ఎస్సీ కుటుంబాలకు లబ్ధి చేకూరేలా దళితబంధు(Dalit Bandhu ) పథకం కింద 7.6 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. హుజూరాబాద్‌లో దాదాపు 15 వేల దళిత కుటుంబాలు ఉన్నాయి. నిధుల విడుదలతో నియోజకవర్గంలోని ఎస్సీలు సంబురాలు చేసుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook