'ఇండస్ట్రీ నుంచి దళితులను గెంటేయాలి'.. నటి సంచలన వ్యాఖ్యలు

నటి మీరా మిథున్ దళితులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తమిళనాట పెనుదుమారమే రేపుతున్నాయి. షెడ్యూల్డ్ కులాల వారి కారణంగానే తమిళంలో మంచి సినిమాలు రావడం లేదని, వారిని ఇండ‌స్ట్రీ నుంచి వెళ్ల‌గొట్టాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 9, 2021, 04:24 PM IST
  • తమిళ నటి సంచలన కామెంట్స్
  • దళితులను ఇండస్ట్రీ నుంచి గెంటేయాలన్న మీరా మిథున్
  • మీరాపై పలు కేసులు నమోదు
'ఇండస్ట్రీ నుంచి దళితులను గెంటేయాలి'.. నటి సంచలన వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీ నుంచి దళితులతో పాటు షెడ్యూల్డ్ కులాల(Scheduled Castes)ను గెంటేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఓ హీరోయిన్. ఆమె పేరు మీరా మిథున్(Meera Mithun). ఈమెపై తమిళనాట కేసుల మోత మోగుతుంది.

దళితుల(Dalits)ను కించపరిచే వారిని, దూషించేవారిని కఠినంగా శిక్షించాలంటూ మన చట్టాలు చెపుతున్నాయి. అయినా కొందరు నోరు జారుతున్నారు. తాజాగా ఇదే కోవకు చెందుతుంది తమిళ నటి మీరా మిథున్(Meera Mithun).  ఏకంగా సినిమా ఇండస్ట్రీ నుంచి దళితులతో పాటు షెడ్యూల్డ్ కులాలను గెంటేయాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈమె వ్యాఖ్యలు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. 

Also Read: సూపర్‌స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌ అదుర్స్, కేక పుట్టిస్తున్న మహేశ్ లుక్స్

మీరాకు తమిళనాట యూ ట్యూబ్ స్టార్‌‌గా గుర్తింపు ఉంది.  షెడ్యూల్డ్ కులాలకు చెందిన ద‌ర్శ‌కులు, న‌టీనుటులు వ‌ల‌నే సినీ ఇండ‌స్ట్రీలో మంచి సినిమాలు రావ‌డం లేద‌ని, వారిని ఇండ‌స్ట్రీ నుంచి వెళ్ల‌గొట్టాలంటూ వ్యాఖ్యలు చేసింది. ఓ దర్శకుడు పబ్లిసిటీ కోసం తన ఫొటోను పర్మిషన్ లేకుండా వాడుకోవడాన్ని తప్పు పట్టిన మీరా మిథున్(Meera Mithun) చేసిన  ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు తమిళనాట(Kollywood) సినీ ఇండ‌స్ట్రీలో దుమారాన్ని రేపాయి. 

మీరా మిథున్(Meera Mithun) ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసింది.షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారి వల్లనే మంచి సినిమాలు రావడం లేదంటూ, వారి పద్ధతులు బాగుండవంటూ  చెప్పింది. పరిశ్రమలోని షెడ్యూల్డ్ కులాల వాళ్లకు అనేక నేరాలకు సంబంధం ఉందని కూడా చెప్పడంతో ద‌ళిత సంఘాలు మీరా మిథున్‌పై మండిప‌డుతున్నాయి. ఆమెపై కేసులు కూడా న‌మోదు చేశారు. 

Also Read:బాలీవుడ్‌‌‌లో విషాదం.. అనారోగ్యంతో సీనియర్ నటుడు అనుపమ్‌ శ్యామ్‌ కన్నుమూత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News