Aadhar Mandatory To Gruha Jyothi Scheme: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కీలక హామీ అయిన ఉచిత విద్యుత్‌పై మార్గనిర్దేశాలు చేస్తోంది. ఈ సందర్భంగా ఉచిత విద్యుత్‌ పొందాలంటే కొన్ని కీలక పత్రాలు ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉచిత విద్యుత్‌ను పొందాలంటే ప్రజలు ఫలానా పత్రాలు ఉండాలని కొన్ని సూచనలు చేసింది. సంక్షేమ పథకాలన్నింటికీ రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డు తప్పనిసరి చేస్తున్న విషయం తెలిసిందే.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: TS High Court: పోలీసులకు 'క్లాస్‌' తీసుకోవాలి.. డీజీపీకి తెలంగాణ హైకోర్టు సూచన


తాజాగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకానికి తెలంగాణ ప్రభుత్వం ఆధార్‌ కార్డును తప్పనిసరిగా చేసింది. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరణ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కొన్ని సూచనలతో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాన్ని క్షేత్రస్థాయిలో డిస్కమ్‌ అమలు చేయనున్నట్లు తెలిపింది. డిస్కమ్‌లకు చెందిన సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినపపుడు కచ్చితంగా ఆధార్‌ కార్డు చూపించినట్లు సూచించింది.

Also Read: Migraine Pain Relief Tips: ఈ చిట్కాలు పాటిస్తే మైగ్రేన్ తలనొప్పి ఇట్టే మాయం.. పాటించి చూడండి


ఆధార్‌ కార్డును చూపించడంతోపాటు బయోమెట్రిక్‌ను తీసుకుంటారని ప్రభుత్వం వెల్లడించింది. బయోమెట్రిక్‌ సక్రమంగా రాకుంటే.. పని చేయకుంటే ఐరిస్‌ను స్కాన్‌ చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. అదీ కూడా పని చేయని పరిస్థితుల్లో ఫొటో తీసుకుంటారని వివరించింది. ఈ ప్రక్రియలు అన్నింటిలోనూ ఫెయిలైనా నిరాశ చెందొద్దని పేర్కొంది. అన్ని ప్రయత్నాలు విఫలమైన సమయంలో లబ్ధిదారుడు ఆధార్‌ క్యూఆర్‌ కోడ్‌ సహాయంతో వివరాలు పొందుతారని ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వుల్లో వెల్లడించింది.


లబ్ధిదారులు తమకు ప్రభుత్వ పథకం అందుతుందా లేదా అనే ఆందోళన అవసరం లేదని ఈ ప్రకటనతో స్పష్టతనిచ్చింది. ఉచిత విద్యుత్‌ కోసం నేరుగా ప్రజల ఇంటి వద్దకే విద్యుత్‌ సిబ్బంది వచ్చి వివరాలు సేకరంచనున్నారు. సిబ్బంది వచ్చిన సమయంలో ఆధార్‌ కార్డుతోపాటు బయోమెట్రిక్‌ చేస్తే చాలు గృహజ్యోతి పథకానికి అర్హత సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ ప్రారంభమైంది. పట్టణం, గ్రామాల్లో విద్యుత్‌ సిబ్బంది ప్రజల వివరాలు సేకరిస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook