Migraine Pain Relief Tips: ఈ చిట్కాలు పాటిస్తే మైగ్రేన్ తలనొప్పి ఇట్టే మాయం.. పాటించి చూడండి 

Migraine Headche Reduce Tips: ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో అనారోగ్యం వచ్చి చేరుతోంది. పరిస్థితుల కారణంగా మైగ్రేన్‌ తలనొప్పి మనల్ని వెంటాడుతోంది. దీని నివారణకు చాలా సులువైన మార్గాలు ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 16, 2024, 09:54 PM IST
Migraine Pain Relief Tips: ఈ చిట్కాలు పాటిస్తే మైగ్రేన్ తలనొప్పి ఇట్టే మాయం.. పాటించి చూడండి 

Reduce Migraine Pain Tips: తలనొప్పి అనేది సర్వ సాధారణమే. కానీ మైగ్రేన్ తలనొప్పి అనేది దీర్ఘకాల సమస్య. ఇది తరచూ ఇబ్బంది పెడుతుండడంతో మన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రోజురోజుకూ మైగ్రేన్ బాధితులు పెరుగుతున్నారు. దీనికి మారుతున్న జీవనకాలమే కారణం. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం లేదు. ఇక ఆహార నియమాలు పాటించడం లేదు. దీనివలన మైగ్రేన్ తలనొప్పి ఎదురవుతోంది. 

Also Read: Mumbai Airport: ఎయిర్‌పోర్టులో దారుణం.. వీల్‌చైర్‌ లేక నడుచుకుంటూ వెళ్లి కుప్పకూలిన వృద్ధుడు

ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది మందులతో నయం అవుతుంది. కానీ మన జీవనశైలి మారితే మందులతో పని లేకుండా మైగ్రేన్ సమస్యను అధిగమించవచ్చు. దీనికి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి వ్యక్తిగత అలవాట్లు, ఆహారపు నియమాలే ఉన్నాయి.

Also Read: Organ Donor: సామాన్యులకు కూడా 'వీఐపీ' అంత్యక్రియలు.. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

హాయిగా నిద్ర 
మైగ్రేన్ తలనొప్పి తగ్గడానికి నిద్ర మంచి సాధనం. ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను కలిగి ఉండాలి. తలనొప్పికి కంటికి అనుబంధం ఉంటుంది. అందుకే తలనొప్పి వస్తే కళ్లద్దాలు ఇస్తారు. కంటి నిండా నిద్రపోతే మైగ్రేన్ సమస్య దాదాపు తగ్గిపోతుంది.

చల్లదనం తలనొప్పికి కారణమవుతుంది. వీలైనంత మేరకు శీతల పానీయాలు తాగడం విరమించుకోవాలి. దాహం, గ్యాస్ కారణాలతో శీతల పానీయాలు తీసుకుంటారు. ఏ కారణంతో వాటిని తీసుకున్నా ఆరోగ్యానికి చేటే. ఇక మైగ్రేన్ ఉంటే తప్పనిసరిగా కూల్ డ్రింక్స్ మానేయాలి. 

మైగ్రేన్ తగ్గడానికి ఇంట్లోనే దివ్యమైన ఔషధాలు ఉన్నాయి. అవేమిటంటే..

  • భోజన సమయంలో నీటిని తీసుకోవడం తగ్గించాలి. భోజనం మధ్యలో నీళ్లు తాగడం మంచిది కాదు.
  • మైగ్రేన్ తో బాధపడేవారు పాలు, చాయ (టీ) మానుకోండి. వీటికి ప్రత్యామ్నాయంగా కొత్తిమీర, బ్లాక్ టీ తాగితే మైగ్రేన్ నుంచి ఉపశమనం ఉంటుంది.
  • మైగ్రేన్ తలనొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే జీలకర్ర, కొత్తిమీర వేసి మరిగించిన నీరు తాగాలి. ఈ ద్రావణం తాగితే మైగ్రేన్ నుంచి కొంత ఊరట లభిస్తుంది.
  • ఒక గ్లాసు మజ్జిగలో ఇంగువ, కరివేపాకు, రాళ్ల ఉప్పు, అల్లం కలిపి తాగాలి. ఇది వేసవిలోనూ శరీరానికి కావాల్సిన చల్లదనం ఇస్తుంది.
  • మైగ్రేన్ నుంచి వెంటనే ఉపశమనం పొందాలంటే ఇంటి వైద్యం ఉంది. ఇది చేస్తే వెంటనే ప్రశాంతత పొందుతారు. ఆవాల పేస్ట్‌ను నుదుటిపై రాసి 10-15 నిమిషాలపాటు అలాగే ఉంచాలి. అనంతరం కడిగేసుకోండి. మైగ్రేన్ సమస్య తగ్గుతుంది ‌ 
  • మన దేహానికి సూర్యరశ్మి పడాలి. చీకటిగదుల్లో ఏసీ కింద గడిపితే మైగ్రేన్ సమస్య వెంటనే వస్తితుంది‌. అలాంటి పరిస్థితే ఉంటే రోజూ కనీసం 15 నిమిషాలు సహజ కాంతిని పొందేలా చూసుకోండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News