Telangana Floods: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారీ వర్షాలు కురిసి జలాశయాలు ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ప్రజలకు కొన్ని జాగ్రత్తలు చెప్పింది. నీటి వనరుల వద్ద వరద ఉధృతి తీవ్రంగా ఉండడంతో ప్రజలు అటు వైపు వెళ్లవద్దని సూచించింది. వెళ్లడమే కాకుండా అక్కడ సరదాగా ఆటలు ఆడడం.. ఫొటోలు దిగడం వంటివి చేయకూడదని పేర్కొంది. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Narendra Modi: తెలంగాణలో వరదలపై ప్రధాని మోదీ ఆరా.. అండగా ఉంటామని భరోసా


 


భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు పలు సూచనలు చేశారు. 'వాగులు, నదులు పొంగి పొర్లుతుంటే పలుచోట్ల ప్రజలు వంతెనలు ఎక్కి చూడడం, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో ఎక్కడైనా బ్రిడ్జి, వంతెన కొట్టుకుపోతే జరిగే ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఈ విధమైన సంఘటనలు అక్కడక్కడ ఎదురవుతున్నాయి. దయచేసి వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లవద్దు. ముఖ్యంగా సెల్ఫీలు, ఫొటోలను తీసుకోవద్దు' అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read: New Route: తెలంగాణ-ఏపీకి కొత్త మార్గం.. ఖమ్మం, విజయవాడలకు వెళ్లడం ఇలా


 


వరదలతో ఖమ్మం జిల్లా జలదిగ్భంధమైంది. ములుగు జిల్లా కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. అక్కడ వరద ముంచెత్తడంతో సహాయ కార్యక్రమాలు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సహాయ బృందాలు రావడానికి ఆలస్యం కావడంతో బాధితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఇలా వాగులు, వంకలు, చెరువుల వద్ద ఈ పరిస్థితి ఏర్పడడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై ప్రకటన విడుదల చేశారు. ప్రజలందరూ వర్షాల వేళ అత్యవసరమైతేనే బయటకు రావాలి. లేకపోతే ప్రమాదాలను కొని తెచ్చుకునే వారవుతారని అధికార యంత్రాంగం హెచ్చరిస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter