New Route: తెలంగాణ-ఏపీకి కొత్త మార్గం.. ఖమ్మం, విజయవాడలకు వెళ్లడం ఇలా

Police Suggested New Route For Vijayawada Khammam From Hyderabad: భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల మధ్య బంధాలను తెంచేయడంతో పోలీస్‌ శాఖ మరో కొత్త మార్గాన్ని సూచించింది. ఖమ్మం, విజయవాడ వెళ్లేందుకు మార్గనిర్దేశం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 1, 2024, 11:10 PM IST
New Route: తెలంగాణ-ఏపీకి కొత్త మార్గం.. ఖమ్మం, విజయవాడలకు వెళ్లడం ఇలా

Hyderabad To Vijayawada: భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల మధ్య బంధం తెగిపోయింది. జాతీయ రహదారిపై ఉధృతంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీలోకి వెళ్లేందుకు కొత్త మార్గాన్ని పోలీసులు సూచించారు. సూర్యాపేట-కోదాడ మీదుగా రాకపోకలను మూసివేయడంతో ప్రత్యామ్నాయ మార్గాన్ని చెప్పారు. ఖమ్మం విజయవాడ వెళ్లేందుకు కొత్త మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు.

Also Read: Chandrababu: ప్రజల కోసం చంద్రబాబు బావమరిది ప్రోగ్రామ్‌ రద్దు.. బస్సులోనే నిద్ర

 

భారీ వర్షాలు.. వరదల నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి చౌటుప్పల్‌-చిట్యాల-నార్కట్‌పల్లి-నల్గొండ-మిర్యాలగూడ-పిడుగురాళ్ల-గుంటూరు-విజయవాడ వెళ్లాలని పోలీస్‌ శాఖ సూచించింది. ఇక ఖమ్మం వెళ్లే వారు చౌటుప్పల్‌-చిట్యాల-నార్కట్‌పల్లి- అర్వపల్లి-తుంగతుర్తి-మద్దిరాల-మర్రిపేట మీదుగా వెళ్లాలని పోలీసుల సూచించారు. అయితే అత్యవసరమైతేనే రాకపోకలు సాగించాలని పోలీస్‌ శాఖ పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో సాధ్యమైనంత ప్రయాణాలు విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: Chandrababu Review: ఆదివారం సెలవు రద్దు.. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన సీఎం చంద్రబాబు

 

భారీ వర్షాలతో హైదరాబాద్‌-విజయవాడ మార్గం పూర్తిగా మూసుకుపోయిన విషయం తెలిసిందే. జాతీయ రహదారిపై నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదలో వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. కొట్టుకుపోయే ప్రమాదం ఉండడంతో అక్కడికక్కడే వాహనాల రాకపోకలను ఆపివేశారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ మధ్య వాహనాలను ఆపేసి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని స్థానిక అధికార యంత్రాంగం సూచించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News