Harish Rao: ఏడేళ్లుగా కేంద్రం నుంచి తెలంగాణకు ఏ సాయం అందలేదు- మంత్రి హరీశ్‌రావు
Minister Harish Rao: కృష్ణా జల వివాద పరిష్కారానికి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) స్పందించారు. ఇక ఈ విషయంలో మంత్రి హరీశ్‌రావు వివరణ ఇచ్చారు. నదీ జలాల్లో రాజ్యాంగబద్ధమైన, న్యాయమైన వాటానే కోరతున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
Telangana has not received any help from the centre for seven years says Minister of Finance Health and Family Welfare Harish Rao: ఏడేళ్లుగా కేంద్రం నుంచి తెలంగాణకు ఏ సాయం అందలేదు- మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేటలో హరీశ్‌రావు (Harish Rao) మీడియాతో మాట్లాడారు. కృష్ణా జల వివాద పరిష్కారానికి కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) స్పందించారు. ఇక ఈ విషయంలో మంత్రి హరీశ్‌రావు వివరణ ఇచ్చారు.
నదీ జలాల్లో రాజ్యాంగబద్ధమైన, న్యాయమైన వాటానే కోరతున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నాలుగు నెలల నుంచే ఈ అంశం పెండింగ్‌లో ఉందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ (Chief Minister KCR) తనపై వ్యాఖ్యలు చేయడం సరైంది కాదంటూ కేంద్ర మంత్రి షెకావత్ అనడం సరైంది కాదన్నారు. ఇది నాలుగు నెలల నుంచి కాదు.. ఏడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్య అని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు.
అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదంపై తెలంగాణ ఏర్పడిన 42వ రోజే సెక్షన్ 3 కింద కేంద్రానికి ఫిర్యాదు చేశామని మంత్రి హరీశ్‌రావు గుర్తు చేశారు. ఏడాది పాటు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆగస్టు 2015లో సుప్రీం కోర్టుకు (Supreme Court) వెళ్లామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. అయినా సుప్రీంకోర్టులో కేసు ఉన్నా నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి కాదన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ ట్రైబ్యునల్‌కు (Brijesh Tribunal) అనుసంధానం చేయండి.. లేదా కొత్త ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయండి అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Also Read :Tamilnadu Lady Police: వరద బాధితులను భుజాలపై ఎత్తుకెళ్లిన మహిళా పోలీస్..
ఇక కేంద్రంతో టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వానికి ఎలాంటి వ్యక్తిగత పంచాయతీ లేదని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడాలన్నదే తమ తపన అని చెప్పారు. అలాగే దొడ్డు రకం కొనాలని ప్రధాని నరేంద్ర మోదీకి ట్వీట్లు చేయాలని, ఇలా అయినా ఆయన మారుతాడో చూద్దామంటూ హరీశ్‌రావు (Harishrao) రైతులకు పిలుపునిచ్చారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు దొడ్డు రకం వడ్లు కొన్నాయని, ఇప్పుడు ఎందుకు కొనరో చెప్పాలన్నారు. రేపు ఢిల్లీలో కూడా ఎంపీలు నిరసన ప్రదర్శనలు చేపడుతారన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, యాసంగిలో వడ్లు (paddy) కొనకపోతే ఇలాంటి ధర్నాలు, ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.
Also Read :Neeraj Chopra: నా బయోపిక్ అప్పుడే వద్దు: నీరజ్ చోప్రా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి