Independence day 2024: 7 సార్లు కత్తిపోట్లు.. రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైన యాదయ్య గురించి ఈ విషయాలు తెలుసా..?
Head Constable Chaduvu Yadaiah: తెలంగాణకు చెందని హెడ్ కానిస్టేబుల్ యాదయ్యకు అరుదైన గౌరవం దక్కింది. ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో ఆయనకు కేంద్రం అత్యున్నత గ్యాలంటీరీ పతకంకు ఎంపికచేసింది. దీంతో పోలీసు అధికారులు యాదయ్యను ప్రత్యేకంగా అభినందించారు.
Telangana Head constable chaduvu yadaiah to get president's medal: ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో.. వివిధ రంగాలలో ప్రత్యేకంగా ప్రతిభ కనబర్చిన 1,037 మంది పోలీసు సిబ్బంది, అగ్నిమాపక దళ సభ్యులు, హోంగార్డులు తదితరుల పేర్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి చదువు యాదయ్య ఈ అత్యున్నత పతకానికి ఎంపికయ్యారు. ఆయన 2022లో ఇద్దరు నేరస్థులను పట్టుకోవడానికి ప్రాణాలను అడ్డుపెట్టారు. ఏడుసార్లు నిందితులు పొట్టలో పొడిచిన కూడా రక్తం కారుతున్న కూడా దైర్యంతో నిందితులను పట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో అప్పట్లో జరిగిన ఘటన పోలీసు శాఖలో సంచలనంగా మారింది. పోలీసు శాఖతో పాటు, ప్రభుత్వం సైతం.. యాదయ్య ధైర్యసాహాసాలను కొనియాడారు. ఈ క్రమంలో..తెలంగాణ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అత్యున్నత పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. ఆయనకు రాష్ట్రపతి గ్యాలంటరీ పోలీసు పతకాన్ని ప్రదానం చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు.
ఇండిపెండెన్స్ డే నేపథ్యంలో.. యాదయ్యతో పాటు మరో 213 మంది సిబ్బందికి మెడల్ ఆఫ్ గ్యాలంటరీని ప్రదానం చేయనున్నారు. సీఆర్పీఎఫ్ కి గరిష్ఠంగా 52 శౌర్య పతకాలు, జమ్మూ కశ్మీర్ పోలీసులకు 31, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి 17 మంది పోలీసు సిబ్బంది, ఛత్తీస్‌గఢ్ నుంచి 15, మధ్యప్రదేశ్ నుండి 12 మందికి పతకాలు వరించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి గ్యాలంటరీ పతకం అత్యున్నతమైనది కావడంతో.. ఈ పతకం వచ్చిన చదువు యాదయ్య పేరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మార్మోగుతోంది. తెలంగాణ ప్రజలు కూడా.. తమ బిడ్డకు అరుదైన సత్కారం లభించడంచంతో ఆనందంలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు అధికారులు, తెలంగాణ ప్రభుత్వం సైతం యాదయ్య దైర్యసాహాసాలను కొనియాడారు.
Read more: Venu Swamy: ఆ ఒక్కరీజన్ తోనే సమంతను పక్కన పెట్టారు.. మరోసారి రెచ్చిపోయిన వేణు స్వామి..
చోరీ కేసులో 2022లో తెలంగాణ పోలీసు శాఖలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ యాదయ్య.. నిందితులైన ఇషాన్ నిరంజన్ నీలంనల్లి, రాహుల్‌ను ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో నిరంజన్, రాహుల్.. యాదయ్యపై కత్తితో దాడికి దిగారు. ఆయన పొట్టలో ఏడు సార్లు కత్తితో పొడిచారు. ఒక వైపు తీవ్ర రక్తస్రావం అవుతున్నా.. యాదయ్య వారితో పోరాడి, చివరకు బంధించారు. ఈ ఘటనలో యాదయ్య... గాయపడి 17 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రాణాలను లెక్క చేయకుండా వీరోచితంగా పోరాడిన యాదయ్య ధైర్యసాహసాలకు గుర్తింపుగా కేంద్రం రాష్ట్రపతి గ్యాలంటరీ పురస్కారాన్ని ప్రకటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter