2014లో ఏపీ,, తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజన సందర్భంగా తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఏపీకు కేటాయించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్‌ను ఏపీకు కేటాయించిన కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సోమేష్ కుమార్ క్యాట్‌ను ఆశ్రయించారు. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల్ని నిలిపివేస్తూ తెలంగాణలో కొనసాగేలా క్యాట్ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ ఉత్తర్వులతోనే సోమేష్ కుమార్ 2014 నుంచి తెలంంగాణలోనే కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని కోరుతూ 2017లో కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా ఇవాళ ఆ కేసులో తీర్పు వెలువడింది. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పిచ్చింది. 


ఏపీ కేడర్‌కు వెళ్లేందుకు 3 వారాల సమయం కోరినా హైకోర్టు తిరస్కరించింది. తక్షణం వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సోమేష్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. సోమేష్ కుమార్ పదవీకాలం మరో ఏడాది ఉంది. వాస్తవానికి సోమేష్ కుమార్ ఏపీకు వెళ్లాల్సిందేనని గతంలోనే కేంద్రం స్పష్టం చేసింది. అయితే సోమేష్ కుమార్ సేవలు తెలంగాణ రాష్ట్రానికి అవసరమని భావిస్తే..ఏపీ అనుమతితో డిప్యూటేషన్‌పై కొనసాగించుకోవచ్చని కేంద్రం సూచించింది. 


Also read: Supreme Court: సుప్రీంకోర్టుకు చేరిన ఏపీ, తెలంగాణ ఆస్థుల పంచాయితీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook