Telangana High Court dismisses Four Petitions Filed Seeking Implementation Of The Dalit Bandhu Scheme In Huzurabad: దళితబంధు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హుజూరాబాద్ లో (Huzurabad) దళితబంధు నిలిపివేతపై నాలుగు పిటిషన్ల దాఖలయ్యాయి. అయితే హైకోర్టు వాటన్నింటినీ కొట్టివేసింది. హైకోర్టులో (High Court) తాజాగా ఇందుకు సంబంధించిన వాదనలు కూడా ముగిశాయి. దళితబంధు పథకాన్ని ఎన్నికల సంఘం ఆపడం సరికాదంటూ కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుంచే పథకం అమలవుతోందని పిటిషనర్లు చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Petrol rate in India: దేశంలో ఆగని పెట్రో మంట- కోల్​కతలో రూ.100 దాటిన లీటర్ డీజిల్ ధర


దళితబంధు (Dalit Bandhu) పథకాన్ని అమలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ఇద్దరు పిటిషనర్లు హైకోర్టును కోరారు. ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్‌ నేత జడ్సన్‌లు వేర్వేరుగా ఈ పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే ఉప ఎన్నిక (Huzurabad byelection) పూర్తయ్యే వరకు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలను నిలిపివేయాలంటూ వాచ్‌ వాయిస్‌ ఆఫ్‌ పీపుల్స్‌ సంస్థ పిటిషన్లు దాఖలు చేశారు.


Also Read : Shocking: యూట్యూబ్‌ వీడియో చూస్తూ.. బిడ్డకు జన్మనిచ్చిన బాలిక!


వీటన్నింటినీ కలిపి విచారణ చేప్టటారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం. అయితే వాదనలు విన్న హైకోర్టు (High Court) నిన్ననే దళితబంధు అమలుపై తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ పిటిషన్ల వాదనలను తోసిపుచ్చుతూ నాలుగు పిటిషన్లను (Four Petitions) హైకోర్టు కొట్టివేసింది. ఇక ఈసీ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. నిష్పక్షపాత ఎన్నికల కోసం తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీకి ఉంటుందని తెలంగాణ (Telangana) హైకోర్టు (High Court) పేర్కొంది.


Also Read : Mumbai Cruise Drugs Case : ఆర్యన్‌ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో ప్రత్యేక సాక్షి కిరణ్‌ గోసవి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook