Coronavirus tests in Telangana | హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ నిర్ధారణ పరీక్షల విషయంలో తెలంగాణ హై కోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు సూచనలు చేసింది. ఏరోజుకు ఆ రోజు విడుదల చేస్తోన్న హెల్త్ బులెటిన్స్‌లో కరోనావైరస్ వ్యాప్తి, కోవిడ్-19 పరీక్షల ఫలితాలకు సంబంధించిన కీలక సమాచారం పొందుపర్చాల్సిందిగా హైకోర్టు తెలంగాణ సర్కారుకు సూచించింది. ముఖ్యంగా కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న జీహెచ్‌ఎంసీ ( GHMC) పరిధిలో వార్డుల వారిగా కరోనా కేసులు వివరాలు వెల్లడించాలని హైకోర్టు స్పష్టంచేసింది. అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ పరిధిలో నమోదయ్యే కరోనా కేసుల వివరాలు సంబంధిత కాలనీ సంఘాలకు ఇవ్వాలని హైకోర్టు తేల్చిచెప్పింది. ( Also Read: TS inter results 2020: తెలంగాణ ఇంటర్ 2020 ఫలితాలు వచ్చేశాయోచ్ )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

54 ఆస్పత్రుల్లో కరోనా చికిత్స:
గాంధీ ఆసుపత్రితో పాటు 54 ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ( COVID-19 treatment) అందుబాటులో ఉన్నాయనే సమాచారాన్ని అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని హైకోర్టు సర్కారుని ఆదేశించింది. 


పరీక్షల సంఖ్య పెంచాలి..
రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన హైకోర్టు.. ఈనెల 29లోగా తాజా పరిస్థితులు, కరోనా పరీక్షలు, కరోనా పాజిటివ్ కేసులు, నివారణకు తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో 79 మంది వైద్యులకు కరోనా సోకినట్లు పబ్లిక్‌ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాస రావు హైకోర్టుకు తెలిపారు. గాంధీలో ప్లాస్మా, యాంటీ  వైరల్‌ డ్రగ్స్‌ ప్రయోగాలు చేస్తున్నట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు కోర్టుకు తెలిపారు.
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..