TS: కరోనా మృతులపై వాస్తవాలు చెప్పండి.. ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులు, పరీక్షలు, బాధితులకు అందిస్తున్న చికిత్సపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించగా.. హైకోర్టు అస్పష్టంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది.
Telangana High Court serious on State Govt: హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ తీరుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనావైరస్ పరిస్థితులు, పరీక్షలు, బాధితులకు అందిస్తున్న చికిత్సపై హైకోర్టు (Telangana High Court) లో శుక్రవారం విచారణ జరిగింది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించగా.. హైకోర్టు అస్పష్టంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ నివేది నిర్లక్ష్యంగా ఉందంటూ తెలిపింది. ప్రైవేటు ఆసుపత్రులు అత్యధికంగా చార్జీలు వసూలు చేయడంపై ఈ నెల 22న నివేదికను సమర్పించాలని, ఇప్పటివరకు ఎన్ని ఆసుపత్రులకు నోటిసులిచ్చారో కూడా వెల్లడించాలని న్యాయస్థానం ఆదేశించింది. Also read: DK Shivakumar: మళ్లీ ఆసుపత్రిలో చేరిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు
రోజూ 8, 10మంది మాత్రమే చనిపోతున్నారా?
అయితే.. కరోనా మృతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు వెల్లడించలేదని ధర్మాసనం పేర్కొంది. కేసులు పెరుగుతున్నా.. మృతుల సంఖ్య 9 లేదా 10 ఉండటం అనుమానంగా ఉందని.. మృతుల సంఖ్యపై వాస్తవ వివరాలు వెల్లడించాలని సూచించింది. జిల్లా స్థాయి బులిటెన్లపై ప్రభుత్వం, జిల్లా అధికారులు వేర్వేరుగా చెబుతున్నారని.. ఆగస్టు 31 నుంచి ఈనెల 4వరకు జిల్లా బులెటిన్లను కూడా సమర్పించాలంటూ ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు దీనిపై విచారణను ధర్మాసనం ఈనెల 24 వరకు వాయిదా వేసింది. Also read: Firecracker Explosion: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి