Agri Gold Case | అగ్రిగోల్డ్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ స్వీకరించనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ జస్టిస్ సీ రామచంద్ర రావు, జస్టిస్ కోడండరామ్ ముందు కేసు వివరాలను ప్రస్తావించారు. అదే సమయంలో పిటిషనర్ తరపు అడ్వకేట్ శ్రవణ్ కుమార్ కూడా తన వాదనను బెంచ్ ముందు వినిపించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | AP Board of Intermediate: విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల


ఈ మేరకు సోమవారం ఈ కేసుపై రెగ్యులర్ హియరింగ్ జరపడానికి న్యాయమూర్తులు అంగీకరించారు. రీపేమెంట్ కోసం అగ్రిగోల్డ్ ( Agri Gold ) బాధితుల దరఖాస్తుల్లో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ఏపి అడ్వొకేట్ జనరల్ శ్రీ రామ్ కోర్టును కోరారు. 


తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో అగ్రీగోల్డ్ ఆస్తులు వేలం వేయాల్సిందిగా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై స్పందించిన తెలంగాణ హైకోర్టు ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ ముందుంచుతాం అని తెలిపింది. హైకోర్టు నిలిపివేసిన అగ్రిగోల్డ్ నిధులను పంచాల్సిందిగా పిటిషనర్ల తరపు న్యాయవాది అయిన శ్రవణ్ కుమార్ కోర్టును కోరారు.



Also Read | Acharya: నవంబర్ 9 నుంచి ఆచార్య షూట్... 



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR