AP Board of Intermediate: విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల

ఏపీలో పాఠశాలలు, కళాశాలల పనిదినాలపై ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ( APBIE )  కీలక నిర్ణయం తీసకుంది. ఈ విద్యా సంవత్సరంలో కాలేజీలు కేవలం 127 రోజులు మాత్రమే కొనసాగుతాయి. 

Last Updated : Nov 4, 2020, 04:40 PM IST
    • ఏపీలో పాఠశాలలు, కళాశాలల పనిదినాలపై ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కీలక నిర్ణయం తీసకుంది.
    • ఈ విద్యా సంవత్సరంలో కాలేజీలు కేవలం 127 రోజులు మాత్రమే కొనసాగుతాయి.
    • ఏపిలో ఏప్రిల్ 24న విద్యా సంవత్సరం ముగుస్తుంది.
AP Board of Intermediate: విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల

ఏపీలో పాఠశాలలు, కళాశాలల పనిదినాలపై ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ( APBIE )  కీలక నిర్ణయం తీసకుంది. ఈ విద్యా సంవత్సరంలో కాలేజీలు కేవలం 127 రోజులు మాత్రమే కొనసాగుతాయి. ఏపిలో ( Andhra Pradesh ) ఏప్రిల్ 24న విద్యా సంవత్సరం ముగుస్తుంది. తరువాత ఏప్రిల్ 25  నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం క్లాసులు మార్చి చివరి వారంలో నిర్వహించున్నారు. 

Also Read | Acharya: నవంబర్ 9 నుంచి ఆచార్య షూట్... 

కొత్త విద్యాసంవంత్సర క్యాలెండర్ ను ఇంటర్మీడియట్ ( Intermediate ) ఎకాడమిక్ కౌన్సిల్ విడుదల చేసింది. వచ్చే సంవత్సరం పరీక్షల్లో తప్పిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షలను జూన్ చివరి వారంలో నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో రెండో శనివారం రోజు కూడా క్లాసులు జరగనున్నాయి.

మరో వైపు టెర్మ్ లీవ్స్ కూడా ఈ సంవత్సరం రద్దు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. 2021-2022 విద్యా సంవత్సరం జూన్ 1 నుంచి  ప్రారంభం అవుతుంది అని తెలిపారు అధికారులు. మరింత సమాచారం కోసం విద్యార్థులు www.bie.ap.gov.in పోర్టల్ చెక్ చేయవచ్చు.

Also Read | Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు 50 శాతం Cashback

ఆన్‌లైన్ అడ్మిషన్స్ పై ఆంధ్రప్రదేశ్ హై కోర్టు స్టే విధించింది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటే కాలేజీల్లో వివిధ కోర్సుల్లో అడ్మిషన్స్ నిలిపివేయాలని తెలిపింది కోర్టు. ఏ నియమాల ఆధారంగా  ఏపి ప్రభుత్వం ఆన్‌లైన్ ( Online ) అడ్మిషన్స్ మొదలుపెట్టింది అని ప్రశ్నించింది కోర్టు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News