GHMC Elections 2020: ఎలక్షన్ కమిషన్ కీలక ఉత్తర్వులకు హైకోర్టు స్టే
High Court of Telangana | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ఎన్నికల కౌంటింగ్ సరికొత్త మలుపుతిరిగింది. కొద్ది రోజుల క్రితం బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు కాకుండా స్టాంపుతో ఏ గుర్తు వేసినా ఓటేసినట్లుగానే పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం సర్క్యూలర్ జారీ చేసింది.
GHMC Elections 2020 | గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ఎన్నికల కౌంటింగ్ సరికొత్త మలుపుతిరిగింది. కొద్ది రోజుల క్రితం బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు కాకుండా స్టాంపుతో ఏ గుర్తు వేసినా ఓటేసినట్లుగానే పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం సర్క్యూలర్ జారీ చేసింది.
Also Read | Farm Bills 2020: కేంద్ర వ్యవసాయ చట్టం, అపోహలు- వాస్తవాలు
అయితే ఈ ఉత్తర్వులపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్క్యూలర్‌ను నిలిపివేయాలి అని తెలిపింది కోర్టు. గురువారం ఎలెక్షన్ సిబ్బందితో ఒక సమావేశం నిర్వహించిన మీటింగ్‌లో పలువురు ఉద్యోగులు ఓటింగ్ సమయంలో ఓటర్లకు స్వస్తిక్ ముద్రకు బదులు, పొరపాటున పోలింగ్ కేంద్రం సంఖ్య తెలిపే ముద్రల్ని ఇచ్చామని తెలంగాణ (Telangana) రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపారు.
ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ ఓట్లనూ లెక్కించాలని ఎన్నికల అధికారులకు సూచించింది. సింబల్ మారినా ఓట్లు వ్యాలీడ్ అని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులపై కాంగ్రెస్, బిజెపి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు కాగా ఈ సర్య్కూలర్‌పై స్టే విధిస్తూ, స్వస్తిక్ సింబల్ ఉన్న ఓట్లే చెల్లుతాయిన తెలిపింది.
Also Read | 5000 రూపాయల బడ్జెట్‌లో బెస్ట్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్, లిస్ట్ చెక్ చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe