TS Inter Exams Schedule: తెలంగాణలో ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్.. కొత్త తేదీలు ఇవే..
Telangana Intermediate Exams Revised Schedule: తెలంగాణలో ఇంటర్ పరీక్షలను ఇంటర్మీడియట్ బోర్డు రీషెడ్యూల్ చేసింది. జేఈఈ మెయిన్స్‌కి హాజరయ్యే విద్యార్థులకు ఆటంకం కలగకుండా షెడ్యూల్‌ను సవరించింది.
Telangana Intermediate Exams Revised Schedule: తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు సవరించింది. సవరించిన షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. రీషెడ్యూల్ ప్రకారం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు, సెకండియర్ పరీక్షలు ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు జరగనున్నాయి. జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ మొదటి సెషన్ ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 21 వరకు, సెకండ్ సెషన్ మే 24 నుంచి మే 29 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ను సవరించింది. ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు నిర్వహించనున్నారు.
[[{"fid":"223595","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఇంటర్మీడియట్ ఫస్టియర్ షెడ్యూల్ :
22-04-2022 : 2nd లాంగ్వేజ్ పేపర్-I
25-04-2022 : ఇంగ్లీష్ పేపర్-I
27-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-I A, బోటనీ పేపర్-I, పొలిటికల్ సైన్స్ పేపర్-I
29-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-I B, జువాలజీ పేపర్-I, హిస్టరీ పేపర్-I
02-05-2022 : ఫిజిక్స్ పేపర్-I, ఎకనమిక్స్ పేపర్-I
06-05-2022 : కెమిస్ట్రీ పేపర్-I, కామర్స్ పేపర్ -I
09-05-2022 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-I, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-I(బైపీసీ విద్యార్థులకు)
11-05-2022 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -I, జాగ్రఫీ పేపర్-I
ఇంటర్మీడియట్ సెకండియర్ షెడ్యూల్ :
23-04-2022 : 2nd లాంగ్వేజ్ పేపర్-II
26-04-2022 : ఇంగ్లీష్ పేపర్-II
28-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IIA, బోటనీ పేపర్-II, పొలిటికల్ సైన్స్ పేపర్-II
30-04-2022 : మ్యాథమెటిక్స్ పేపర్-IIB, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
05-04-2022 : ఫిజిక్స్ పేపర్-II, అర్థశాస్త్రం పేపర్-II
07-05-2022 : కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్ -II
10-05-2022 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్-II(బైపీసీ విద్యార్థులకు)
12-05-2022 : మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ -II, జాగ్రఫీ పేపర్-II
Also Read: PM KISAN Scheme Instalment: పీఎం కిసాన్ స్కీమ్ ఇన్‌స్టాల్‌మెంట్ రాలేదా? ఇలా చేయండి
Also Read: Palm Reading: చేతిలో ఈ గుర్తులు ఉంటే.. అపార సంపదకు యజమానులు అవుతారట..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook