TS Inter Exam Date 2021: తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు ఎగ్జామ్స్ షెడ్యూల్‌ విడుదల అయ్యింది. మే 1న తెలంగాణ ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానుండగా.. మే 2 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు మొదలవుతాయి. ఇంటర్ ఫస్టియర్ బోర్డ్ ఎగ్జామ్స్ మే 1 నుంచి 19 వరకు, ఇంటర్ సెకండియర్ పరీక్షలు మే 2 నుంచి 20 వరకు జరగనున్నాయి. తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం నాడు ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూలు(TS Inter Exam 2021 Schedule) విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌, ఏప్రిల్‌ 3న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్‌ ఎగ్జామ్స్ షెడ్యూల్ చేశారు. వీటితో పాటు ఒకేషనల్‌ కోర్సులకు కూడా ఇదే సమయంలో పరీక్షలు(TS Inter Exam Dates 2021) నిర్వహించనున్నారు.


Also Read: New Rules from February 2021: ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త నియమాలు, రూల్స్ ఇవే



తెలంగాణ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షల షెడ్యూల్‌(TS Inter 1st Year Exam Dates 2021)
మే 1        సెకండ్ లాంగ్వేజ్ పేపర్‌-1
మే 3        ఇంగ్లీష్‌ పేపర్‌-1
మే 5        మ్యాథ్స్‌ పేపర్‌-1ఏ, బోటనీ-1, సివిక్స్‌-1
మే 7        మ్యాథ్స్‌ పేపర్‌-1బీ, జువాలజీ-1, హిస్టరీ-1
మే 10      ఫిజిక్స్ పేపర్‌-1‌, ఎకనామిక్స్‌-1, 
మే 12     కెమిస్ట్రీ, సోషియాలజీ, కామర్స్‌


Also Read: India Post Jobs 2021: తెలంగాణలో Gramin Dak Sevak Postsకు నోటిఫికేషన్, పూర్తి వివరాలు



తెలంగాణ ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల షెడ్యూల్‌(TS Inter 2nd Year Exam Dates 2021)
మే 2       సెకండ్ లాంగ్వేజ్ పేపర్‌-2
మే 4       ఇంగ్లీష్‌ పేపర్‌-2
మే 6       మ్యాథ్స్‌ పేపర్‌-2ఏ, బోటనీ-2, సివిక్స్‌-2
మే 8      మ్యాథ్స్‌ పేపర్‌-2బీ, జువాలజీ-2, హిస్టరీ-2
మే 11    ఫిజిక్స్‌ పేపర్‌-2, ఎకనామిక్స్‌-2
మే 13    కెమిస్ట్రీ పేపర్‌-2, సోషియాలజీ-2, కామర్స్‌-2 


Also Read: Telangana Govt Jobs: తెలంగాణలో 39 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ, PRC Reportలో ఊహించని వివరాలు 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook