GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం ముగిసింది. విమర్శలు ప్రతి విమర్శలు ప్రారంభమయ్యాయి. కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు..మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


జీహెచ్ఎంసీ ఎన్నికల ( Ghmc Elections )ప్రచార పర్వం ముగిసింది. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. ఇవాళ ప్రచారం చివరి రోజున కేంద్రమంత్రి అమిత్ షా ( Central minister Amit shah )..భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ( Trs Government )పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ విమర్శలపై మంత్రి కేటీఆర్ ( KTR ) కౌంటర్ ఇచ్చారు. ఆరేళ్ల ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి ఏమిచ్చిందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. వరద సహాయం కింద మోదీ ప్రభుత్వం 25 వేలిస్తుంటే ఎవరైనా ఆపుతున్నారా అని విమర్శించారు.


హైదరాబాద్‌ ( Hyderabad) కు టీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న బీజేపీ నేత అమిత్ షా..గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి సంస్థల్ని ఎవరు తెచ్చారో చెప్పాలన్నారు. సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. 


పొలిటికల్ టూరిస్టులందరికీ స్వాగతమని..కేంద్రమంత్రులు ఉత్తచేతుల్తో వచ్చారని ఎద్దేవా చేశారు. వరదలు వచ్చినప్పుడు తాను, మంత్రులు నగరంలో తిరిగామని గుర్తు చేశారు. వరద సహాయం చేస్తుంటే..ఎక్కడ కేసీఆర్ ప్రభుత్వానికి ( kcr government ) మంచి పేరు వచ్చేస్తుందో అని నిలిపేశారని ఆరోపించారు. జంగిల్ రాజ్ నుంచి వచ్చిన యూపీ ముఖ్యమంత్రి ఇక్కడ నీతులు చెబుతున్నారని మండి పడ్డారు. మాది నిజాం సంస్కృతి కాదు..మీరు చెప్పేది వినడానికి ఇది అహ్మదాబాద్ కాదు అమిత్ షా గారూ..ఇది హుషారైన హైదరాబాద్ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పిన మోదీ..ఎన్ని ఉద్యోగాలిచ్చారో చెప్పాలన్నారు. జన్‌ధన్ ఖాతాల్లో 15 లక్షల చొప్పున ఎంతమందికి వేశారో చెప్పాలన్నారు. 


హైదరాబాద్‌లో ఎలాంటి గొడవలు, కర్ఫ్యూలు లేవు. హైదరాబాద్‌లో మంచి వాతావరణం ఉంది కాబట్టే భారీగా పెట్టుబడులు వస్తున్నాయని కేటీఆర్ చెప్పారు.  ఇది అందరి హైదరాబాద్‌..కానీ దీన్ని కొందరి హైదరాబాద్‌గా చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారని విమర్శించారు. Also read: GHMC Elections 2020: మధ్యలోనే ముగిసిన అమిత్ షా రోడ్ షో..ఎందుకో తెలుసా