GHMC Elections 2020: మధ్యలోనే ముగిసిన అమిత్ షా రోడ్ షో..ఎందుకో తెలుసా

GHMC Elections 2020: జీహెచ్ఎంసీ ఎన్నికల చివరిరోజు నగరం కాషాయమయమైంది. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో కేంద్ర మంత్రి అమిత్ షా రోడ్ షో..పార్టీకు కొత్త ఉత్సాహాన్ని నింపినా..మధ్యలోనే ఆగిపోయింది. కారణమిదే..

Last Updated : Nov 29, 2020, 04:21 PM IST
  • సికింద్రాబాద్ వారాసి గూడ నుంచి సీతాఫల్ మండి వరకూ సాగాల్సిన రోడ్ షో
  • భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానుల కారణంగా మధ్యలోనే ఆగిన పరిస్థితి
  • సమయాభావం కారణంగా రోడ్ షో మధ్యలోనే నిలిపివేత..పార్టీ కేడర్ లో ఉత్సాహాన్ని నింపిన రోడ్ షో
GHMC Elections 2020: మధ్యలోనే ముగిసిన అమిత్ షా రోడ్ షో..ఎందుకో తెలుసా

GHMC Elections 2020: జీహెచ్ఎంసీ ఎన్నికల చివరిరోజు నగరం కాషాయమయమైంది. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో కేంద్ర మంత్రి అమిత్ షా రోడ్ షో..పార్టీకు కొత్త ఉత్సాహాన్ని నింపినా..మధ్యలోనే ఆగిపోయింది. కారణమిదే..

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ( Ghmc Elections ) ప్రచారంలో ఇవాళ చివరి రోజు. ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా బీజేపీ అగ్రనేత కేంద్రమంత్రి అమిత్ షా ( Central minister Amit shah ) పర్యటనతో నగరమంతా కాషాయమయంగా మారింది. ఇప్పటికే పులువురు బీజేపీ నేతల ప్రచారానికి తోడు..అమిత్ షా రోడ్ షో ( Amit Shah road show ) పార్టీలో కచ్చితంగా కొత్త ఊపు తెచ్చిపెట్టింది. అయితే రోడ్ షో అనుకున్నట్టుగా పూర్తిగా సాగలేదు. మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది.

వాస్తవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షో..సికింద్రాబాద్ వారాసి గూడ నుంచి సీతాఫల్ మండి హనుమాన్ టెంపుల్ వరకూ కొనసాగాల్సి ఉంది. అయితే రోడ్ షో కోసం బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి రావడంతో  ప్రచార రధం చాలా నెమ్మదిగా కదిలింది. భారీగా జనం తరలిరావడంతో రోడ్ షో ను వేగవంతం చేసేందుకు ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీనికి తోడు రోడ్ షో కోసం రప్పించిన వాయిద్య కళాకారుల బృందాలు కూడా రోడ్ షో కదలకుండా చేశాయి. దాంతో సీతాఫల్ మండి ఫ్లై ఓవర్ వరకూ సాగాల్సిన రోడ్ షో...మధ్యలో నామాలగుండు వద్దే ఆగిపోయింది.  

బీజేపీ ( Bjp ) కార్యకర్తలకు తోడు జనసేన శ్రేణులు కూడా ప్రచారంలో పాల్గొనడంతో రోడ్ షో ముందుకు కదలడం అసాధ్యమైంది. ఓ వైపు సమయం ముంచుకొస్తోంది. ఎందుకంటే ప్రచారాన్ని సాయంత్రం 5 గంటల్లోగా ముగించాల్సిన పరిస్థితి. ప్రెస్ మీట్ అడ్రస్ చేయాల్సి ఉంది. సాయంత్రం 5 దాటిన తరువాత బయటివ్యక్తులెవరూ నగరంలో ఉండకూడదనేది ఎన్నికల కోడ్ నిబంధన. అందుకే రోడ్ షో ను మధ్యలోనే నిలిపేశారు. 

లేకుంటే..అటు ఎన్నికల కమీషన్ ( Election commission )..ఇటు విపక్ష పార్టీలు తప్పుబట్టే అవకాశాలున్నాయి. ఆ పొరపాటు జరగకూడదనే ఉద్దేశ్యంతో ఎన్నికల కోడ్ గౌరవించాలనే ఆలోచనతో రోడ్ షో మధ్యలోనే ఆపేశారు. Also read: Amit Shah: భాగ్యలక్ష్మి ఆలయంలో కేంద్ర హోంమంత్రి పూజలు

Trending News