Telangana Minister KTR Father-in-Law Health Update: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, తెలంగాణ ఐటీ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇంట తీవ్ర విషాదం నెలకొందని సీఎం కేసీఆర్ వియ్యంకుడు కేటీఆర్ కు పిల్లనిచ్చిన మామ పాకాల హరినాథరావు గుండెపోటుతో మృతి చెందారని ప్రచారం జరిగింది. ఆయన వయసు ప్రస్తుతం 72 సంవత్సరాలు. ఆయనకు మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ కి తరలించారని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఆయన ట్రీట్మెంట్ పొందుతూ బుధవారం రాత్రి 8:30 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయని అంటూ ప్రచారం జరగగా అది నిజం కాదని కేసీఆర్ కుటుంబ సభ్యుల నుంచి క్లారిటీ వచ్చింది. మంత్రి కేటీఆర్ గారి మామయ్య పాకాల హరినాథ్ రావు గారి ఆరోగ్య పరిస్థితి పై అప్డేట్ అంటూ ఒక క్లారిటీ నోట్ విడుదల చేశారు. మంత్రి కేటీఆర్ గారి మామయ్య ( కేటీఆర్ గారి భార్య శైలిమా తండ్రి) పాకాల హరినాథ్ రావు  అనారోగ్యంతో ఏఐజి ఆసుపత్రిలో చేరి ఇంకా చికిత్స పొందుతున్నారని, ఆయన పరిస్థితి కొంత విషమంగా ఉన్నప్పటికీ ఆయనకు చికిత్స కొనసాగుతోందని ఆ నోట్ లో పేర్కొన్నారు.


ఆయన అనారోగ్యం విషయంలో వస్తున్న ఇతర వార్తలను పట్టించుకోవద్దని కూడా అందులో విజ్ఞప్తి చేశారు. ఇక తన మామ హరినాథరావు అనారోగ్య గురించి తెలుసుకున్న మంత్రి కేటీఆర్ తన భార్య శైలిమ సహా ఇతర కుటుంబ సభ్యులను తీసుకుని హాస్పిటల్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. పాకాల హరినాథరావు గతంలో డీహెచ్ఎఫ్ఓగా పని చేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతానికి ఆయన రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ లో నివాసం ఉంటున్నారు. ఇక గతంలో మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు మీద కాంగ్రెస్ ఛీఫ్ రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు.


హరినాథరావు  ఎస్టీ సర్టిఫికెట్ పొంది.. ఆ సర్టిఫికెట్ తో డీఎఫ్‌వోగా ఉద్యోగం పొందాడంటూ అప్పట్లో సంచలన ఆరోపణలు చేశారు. కొన్నేళ్లుగా నెలకు దాదాపు రూ. 40 వేల చొప్పున పెన్షన్ కూడా పొందుతున్నారని ఆయన విమర్శలు చేశారు. వెలమ సామాజిక వర్గానికి చెందిన కేటీఆర్ బంధువులు.. ఎస్టీ సర్టిఫికెట్ ఎలా పొందుతారు? అనే ప్రశ్న తలెత్తేలా అప్పట్లో రేవంత్ ఆరోపణలు చేశారు. ఆ తరువాత ఈ విషయం మరుగున పడింది. 


Also Read: Pragya Jaiswal Hot Photos: ప్రగ్యా జైస్వాల్ హాట్ ట్రీట్..పొట్టి బట్టల్లో రచ్చ లేపిందిగా! 


Also Read: Anchor Vindhya Vishaka : ఇన్ని కష్టాలు అనుభవిస్తోందా?.. తండ్రి గురించి తపన.. యాంకర్ వింధ్యా విశాఖ ఎమోషనల్ పోస్ట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook