KTR: హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ పరిధిలోని కైతలాపూర్ లో నిర్మించిన ఫ్లైఓవర్ ను రాష్ట్ర మున్సిపల్ , ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు.  కైతలాపూర్‌లో ఫ్లై ఓవర్‌ను  86 కోట్ల ఖర్చుతో జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ ఫ్లైఓవర్‌తో కూకట్‌పల్లి, హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తీరనున్నాయి. జేఎన్టీయూ- హైటెక్ సిటీ ప్రధాన రహదారిపై రద్దీ తగ్గనుంది. హైటెక్ సిటీ ఫ్లై ఓవర్, సైబర్ టవర్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడనుంది. సనత్‌నగర్, బాలానగర్ , మూసేపేట నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్ రావడానికి ఈజీగా అవుతుంది. కైతలాపూర్ ఫ్లైఓవర్ తో హైటెక్ సిటీ- సికింద్రాబాద్ మార్గంలో తిరిగేవారికి మూడున్నర కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా కైతలాపూర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించింది టీఆర్ఎస్. ఈ సభలో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ పురోగతిని వివరిస్తూ కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో గత ఎనిమిది ఏళ్లలో అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించామని చెప్పారు. రూ. 8500 కోట్లతో మొదటి విడుత SRDP పనులు చేపట్టామని తెలిపారు. రాబోయే రోజుల్లో 3 వేల 115 కోట్లతో రెండో దశలో  మరిన్ని ఫ్లై ఓవర్ లు నిర్మిస్తామన్నారు కేటీఆర్. కేంద్రం పరిధిలో ఉన్నా ఐడిపిఎల్ పరిసరాల్లో ఎవరు చెయ్యని విధంగా అనేక రోడ్లు, అభివృద్ది పనులు చేశామని తెలిపారు. ఇక్కడ ఫ్లై ఓవర్లు,అండర్ పాస్ లు నిర్మిస్తుంటే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడ్డుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. అభివృద్ధి పనులు చేస్తున్న అధికారులపై కేసులు పెట్టాలని అంటున్నారని అన్నారు. కిషన్ రెడ్డి.. అధికారుల మీద కాదు తన మీద కేసు పెట్టు అంటూ కేటీఆర్ సవాల్ చేశారు.


కొత్త పెన్షన్ లు త్వరలో మంజూరు చేయబోతున్నామని చెప్పారు కేటీఆర్. స్టానిక ప్రజాప్రతినిదుల ద్వారా ఇంటింటికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్లను త్వరలోనే పంపిణి చేస్తామని తెలిపారు. గతంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించామన్నారు. 2014లో జన్ ధన్ ద్వారా 15 లక్షలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చారని. ఎంత మందికి ఇచ్చారని నిలదీశారు. గత ఏడాది హైదరాబాద్ లో వరదలు వస్తే కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణకు రూపాయి సాయం చేయని బీజేపీ నేతలు.. ఎన్నికల కోసం పోటీపడి వస్తున్నారని కేటీఆర్ సెటైర్లు వేశారు. అగ్నిపథ్ స్కీమ్ తెచ్చి యువత జీవితాలతో మోడీ సర్కార్ ఆటలాడుతోందని మండిపడ్డారు. చమురు ధరలు పెరగడానికి మోడీ సర్కార్ విధానాలే కారణమన్నారు.


Read Also: Hyderabad Pub: పబ్ లో యువతి పై దాడి.. గ్యాంగ్ రేప్ చేస్తామని వార్నింగ్! హైదరాబాద్ లో మరో కిరాతకం..  


Read Also: Agniveer Notification 2022: అగ్నివీర్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవిగో..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి