Telangana Ministers First Signatures in Telangana New Secretariat: కొత్త సచివాలయంలో మంత్రులు ఎవరికి కేటాయించిన చాంబర్లలో వారు ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు చేపట్టారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తన ఛాంబర్ నుంచి బాధ్యతలు చేపట్టారు. టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్స్‌ల డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ ఫైలుపై మంత్రి హరీశ్ రావు మొదటి సంతకం చేశారు. అలాగే ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ఇటీవల అకాల వర్షాల కారణంగా పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు పంట సాయం కింద రూ. 151. 64 కోట్ల నిధుల విడుదల చేస్తూ మరో ఫైలుపై మంత్రి హరీశ్ రావు తన సంతకాన్ని చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వ్యవసాయ విద్యుత్ సబ్సిడీపై మంత్రి జగదీష్ రెడ్డి తొలి సంతకం.                                                    
విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నూతన ఛాంబర్ లో ప్రవేశించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ముహూర్తం సమయానికి తాను అనుకున్న ఫైల్ మీద మంత్రి జగదీష్ రెడ్డి తొలి సంతకం చేశారు. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీపై మంత్రి జగదీష్ రెడ్డి తన మొదటి సంతకం పెట్టారు. మే నెల చివరికిగాను వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ 958 కోట్ల 33 లక్షల 33 వేల విద్యుత్ సబ్సిడీ నిమిత్తం టిఎస్ డిస్కంలకు మంజూరు చేస్తూ ఈ సంతకం చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డి ఛాంబర్ ప్రారంభోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగందర్ రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసన సభ్యులు గాధరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, యన్.భాస్కర్ రావు తదితరులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.


రోడ్లు భవనాల శాఖ పునర్వ్యవస్థీకరణ ఫైల్ పై తొలి సంతకం చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి


ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖను పునర్వ్యవస్థీకరించాలనే సంకల్పంతో ఉన్నారని.. అందులో భాగంగానే 472 పోస్టులు మంజూరు చేయడంతో పాటు కొత్త కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రోడ్లు భవనాల శాఖలో పునర్వ్యవస్థీకరణ చేపట్టి, మూడు చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలను, 10 సర్కిల్స్ ను, 13 డివిజన్లను, 79 సబ్-డివిజన్లను, 124  సెక్షన్ లను కొత్తగా ఏర్పాటు చేసుకున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. 


ఇది కూడా చదవండి : New Secretariat In Telangana: కొత్త సచివాలయం గుండెకాయ వంటిది.. చెమట చిందించిన ప్రతి శ్రామికుడికీ ధన్యవాదాలు: సీఎం కేసీఆర్


తెలంగాణ రాష్ట్రం సిద్దించిన రోజైన జూన్ 2 నుండి మొత్తం 328 నూతన  కార్యాలయాలను ప్రారంబించాడానికి, పూర్తీ అదనపు బాద్యతలతో అధికారులను నియమించేందుకు సంబంధించిన ఫైలుపై మంత్రి వేముల నూతన సెక్రటేరియట్ లో 5వఅంతస్థులో గల తన ఛాంబర్ లో సంబంధిత ఫైల్ పై తొలి సంతకం చేసారు.


ఇది కూడా చదవండి : Revanth Reddy About KCR: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా.. కొత్త సెక్రటేరియట్‌పై రేవంత్ రెడ్డి కామెంట్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK