హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో (జనవరి 20న) గడువు ముగిసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచీ గ్రామాలు, నగరాలు, పట్టణాలలో మోగిన మైకులు సోమవారం సాయంత్రం 5గంటలతో మూగబోయాయి. మున్సిపల్ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మంత్రి కేటీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో హోరాహోరీగా ప్రచారం చేయించింది. బీజేపీ, కాంగ్రెస్ సైతం కీలక నేతలను రంగంలోకి దింపి ప్రచారాన్ని హోరెత్తించాయి. అయితే కరీనంగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో జనవరి 22 సాయంత్రం వరకు ప్రచారం నిర్వహిస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ఆ టీఆర్ఎస్ నేతలను పీకిపారేస్తాం: కేటీఆర్


టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల రాజన్న జిల్లాలో జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని కార్యకర్తలతో ఉత్సాహాన్ని నింపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని సీఎం కేసీఆర్ ధీమాగా ఉన్నారు. చివరి రోజు ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డి నల్గొండ జిల్లాలో ప్రచారం చేశారు. మంత్రి కేటీఆర్‌వి ఉత్తరకుమార ప్రగల్భాలని విమర్శించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ తదితరులు బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. 


Also Read: కేటీఆర్‌వి ఉత్తరకుమార ప్రగల్భాలు: కిషన్ రెడ్డి


మున్సిపల్ ఎన్నికలతో మరోసారి తెలంగాణలో పార్టీ పుంజుకోవాలని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున ఎంపీలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలు విశేషంగా ప్రచార కార్యక్రమాలను నడిపించారు. అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. జనవరి 22న పోలింగ్ నిర్వహించనుండగా, 25న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎలక్షన్ జరగనుంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..