CM Revanth Reddy: రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే.. ఓయూ విద్యార్థి నుంచి సీఎం వరకు..!
Revanth Reddy Political Career: విద్యార్థి నేతగా రాజకీయ జీవితం ప్రారంభించి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచి.. ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేసి.. నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు రేవంత్ రెడ్డి. ఆయన రాజకీయ ప్రస్థానం ఇలా..
Revanth Reddy Political Career: తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపికయ్యారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఆయన పేరును ప్రకటించారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తమ పేర్లు కూడా పరిశీలించాలని అధిష్టానానికి విన్నవించినా.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డినే హైకమాండ్ ఎంపిక చేసింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. డిసెంబర్ 7న రాజ్‌భవన్‌లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఉండనున్నట్లు తెలిసింది. తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంపై రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ తల్లి మా ప్రియతమ సోనియమ్మ.. ఎప్పుడూ స్ఫూర్తిదాయకమైన నాయకురాలు అని కొనియాడారు.
"సీఎల్పీ నేతగా ఎన్నుకున్నందుకు సహకరించిన వారికి ధన్యవాదాలు, ఎంపిక చేసిన మల్లికార్జున ఖర్గే, మద్దతుగా నిలిచిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు.. 7వ తేదీన ప్రమాణ స్వీకారం.. ఆ కార్యక్రమానికి ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్తున్నా.." అని రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.
1969లో జననం..
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ రెడ్డి.. 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు నరసింహారెడ్డి, రామచంద్రమ్మ. వారికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. రేవంత్ రెడ్డి ఉస్మానియా వర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. దివంగత కాంగ్రెస్ జైపాల్ రెడ్డి దగ్గరి బంధువు గీతారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు నైమిషారెడ్డి ఏకైక సంతానం.
రాజకీయ ప్రస్థానం ఇలా..
మొదట ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నేతగా తన రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆ తరువాత 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీగా పోటీ చేసి విజయం సాధించి సంచలనం సృష్టించారు. 2009, 2014 ఎన్నికల్లో కొడంగల్ నుంచే టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2017 వరకు రేవంత్ రెడ్డి టీడీపీకి ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరించారు. అదే ఏడాది టీడీపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్‌లో చేరారు. తక్కువ సమయంలోనే 2018లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పదవి పొందారు. 2019లో మల్కాజ్గరి స్థానం ఎంపీగా విజయం సాధించారు. 2021లో జూన్ 26న పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2023లో కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. తెలంగాణ రెండో ముఖ్యమంత్రి ఎన్నికయ్యారు. ఎల్లుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Also Read: Abhiram Daggubati: దగ్గుబాటి అభిరామ్ పెళ్లి.. సురేష్ బాబు ఇంట మొదలైన సంబరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి