Rajiv Swagruha Flats: భారీ సెల్.. అమ్మకానికి రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు.. పూర్తి వివరాలు ఇవే..
Rajiv swagruha flats: గ్రేటర్ పరిధిలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నట్లు తెలుస్తొంది. ఈ మేరకు ఆయా ఏరియాలోని అధికారులను సంప్రదించాలని కూడా సర్కారు పలు సూచనలు చేసినట్లు తెలుస్తొంది.
Rajiv swagruha flats for sales in hyderabad: తెలంగాణలో ప్రస్తుతం రేవంత్ సర్కారు ప్రజాపాలన దిశగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తొంది. ఒకవైపు ఎన్నికలలో ఇచ్చిన హామీల అమలుకై చర్యలు తీసుకుంటున్నారు. మరొవైపు గత ప్రభుత్వం వైఫల్యాలను కూడా ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. అయితే.. ప్రస్తుతం తెలంగాణ గత సర్కారు అక్రమాల వల్ల అప్పుల ఊబీలో కూరుకుపోయిందని రేవంత్ పలు మార్లు విమర్శలకు దిగారు.
ఈ క్రమంలో గత ప్రభుత్వం చేసిన అప్పులకే.. తాము ఇంకా మిత్తిలు కడుతున్నామని కూడా అసెంబ్లీ వేదికగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం గ్రేటర్ హైదరబాద్ పరిధిలోని.. రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు అమ్మకానికి రంగం సిద్దం చేసినట్లు తెలుస్తొంది. అయితే.. ఇప్పటికే బండ్లగూడలోని దాదాపు.. 159, పోచారంలోని 601 ఫ్లాట్ లు అమ్మకానికి ఉన్నట్లు తెలుస్తొంది.
అదే విధంగా.. పోచారం, గాజుల రామారం, జవహర్ నగర్ లో నిర్మాణ దశలో ఉన్న అపార్ట్ మెంట్ లు సైతం..వేలం వేయనున్నట్లు సమాచారం. అయితే.. వీటి అమ్మకానికి సంబంధించి మరిన్ని వివరాలకు ఆయా స్థానిక అధికారులను సంప్రదించాలని కూడా అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకాలతో.. ప్రభుత్వం.. రూ. 2500 కోట్ల వరకు ఆదాయం అర్జించాలని కూడా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
Read more: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ సహా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ
మొత్తంగా తెలంగాణ సర్కారు మాత్రం.. రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను రెండు దశలో అమ్ముతున్నట్లు తెలుస్తొంది. నిర్మాణదశలో ఉన్నఫ్లాట్ల అమ్మకాలను.. బిల్డర్ లకు లేదా రియల్టర్లకు అమ్మేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తొంది. అయితే.. ఈ ఫ్టాట్లను కొనేందుకు ఆసక్తిగా ఉన్నవాళ్లంతా స్థానిక అధికారుల్ని కలిసి మరిన్ని వివరాలు తెలుసుకొవాలని ఉన్నతాధికారులు ఒక ప్రకటలో కొరినట్లు తెలుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook