కోవిడ్ 19 మహమ్మారిని ( Covid19 Pandemic ) దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్య సేవలందించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  పీజీ మెడికోలు ( PG Medicos ) ఇకపై ఏడాది పాటు తప్పనిసరిగా ప్రభుత్వ సేవలందించాలని ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కోవిడ్ 19 వైరస్ ( Covid 19 Virus ) తెలంగాణ ( Telangana ) లో రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. వైరస్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. మెరుగైన వైద్య సేవలందిచాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపధ్యంలో సుశిక్షుతులైన వైద్య సిబ్బంది సేవల కోసం తెలంగాణ ప్రభుత్వం ( Telangana Government ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పీజీ మెడికోలు తప్పనిసరిగా ఏడాది పాటు ప్రభుత్వ సేవలందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 2017-18 బ్యాచ్ కు చెందిన పీజీ విద్యార్ధుల్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు అటాచ్ చేస్తూ కోవిడ్ 19 విధుల్లో( Covid 10 Duties ) నియమించింది. ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంతో పీజీ మెడికో విద్యార్ధులు తప్పనిసరిగా ఏడాది పాటు ప్రభుత్వ వైద్య విభాగాల్లో సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ( Director of Medical Education ) నుంచి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలకు సూచనలు అందాయి. పీజీ మెడికోలందర్నీ ప్రభుత్వ ఆస్పత్రి సూపరీంటెండెంట్ కు రిపోర్ట్ చేయాాాల్సిందిగా సూచించారు. Also read: Telangana: ఆ బస్సులకు గులాబీ రంగు తొలగించండి: CM KCR