Telangana Police: తెలంగాణ పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయం పోలీస్ కుటుంబాల్లో తీవ్ర కలకం రేపుతోంది. ఇటీవలె ఒకే రాష్ట్రం ఒకే పోలీస్ విధానమంటూ పోలీస్ కానిస్టేబుల్స్ వివిధ జిల్లాల్లో ఆందోళనకు దిగారు. అత్యవసర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు ఈ రకంగా ధర్నాలో పాల్గొనడం పోలీస్ మాన్యువల్స్ ప్రకారం నిషిద్ధం. ఈ నేపథ్యంలో బెటాలియన్ ఉద్యమంలో పాల్గొన్న 10 మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ ను సర్వీసు నుంచి తెలిగిస్తూ ఏడీజీ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ సర్వీస్ రూల్స్ ప్రకారమే ధర్నాలో పాల్గొన్న కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేసినట్టు చెప్పుకొచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రీసెంట్ లో పోలీస్ కానిస్టేబుల్స్ తో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు వన్ స్టేట్..వన్ పోలీస్ విధానమంటూ రోడ్డుకెక్కారు.  దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఆందోళనలో పాల్గొన్న వారిలో 39 మంది సస్పెండ్ చేస్తూ పోలీసులు హైయ్యర్ అఫీషియల్స్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అందులో 10 మంది పూర్తిగా సర్వసు నుంచి రిమూవ్ చేస్తూ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయా కానిస్టేబుల్స్ ఫ్యామిలీస్ ను వీళ్లే వెనక ఉండి నడిపించారని అంతర్గత విచారణలో తేలడంతో 10 మందిని పోలీస్ సర్వీస్ మాన్యువల్స్ ప్రకారం పూర్తిగా సర్వీసు నుంచి తొలిగించినట్టు చెప్పారు.


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


సర్వీస్ నుంచి 10 మంది పోలీసులను తొలగించడంపై ఆయా పోలీస్ కుటుంబ సభ్యులు ప్రభుత్వంతో పాటు పోలీస్ ఉన్నతాధికారులపై మండిపడుతున్నారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి న్యాయ బద్ధంగా ధర్నా చేస్తే ఇలా సర్వీస్ నుంచి తొలిగించడం దారుణాతి దారుణం అంటున్నారు సస్పెండ్ అయిన కుటుంబ సభ్యులు. అయితే.. వివిధ శాఖల్లో లాగా.. అత్యవసరంతో పాటు దేశ రక్షణకు సంబంధించిన సర్వీసులో ఉన్నవారు ధర్నా చేయడం  పూర్తిగా నిషిద్ధం. వివిధ ప్రభుత్వ శాఖల్లో మాదిరి పోలీసులు ధర్నా చేయకూడదు. ఒకవేళ చేస్తే.. పోలీస్.. ఇతర అత్యవసర సేవల ప్రకారం సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలతోనే పోలీస్ ఉన్నతాధికారులు 10 మందిని విధుల నుంచి తొలగించినట్టు చెబుతున్నారు. ఈ విషయమై ఇతర ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయనేది చూడాలి.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter