Big Shock to CM Revanth Reddy On 12 BRS MLAs Joining In Congress: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు దేశంలోనే హట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే లిక్కర్ కేసులో ఎమ్మెల్సీకవిత అరెస్ట్ అయి తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా రోజుకోమలుపు తిరుగుతుంది. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది కీలక నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లి చేరుతున్నారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర పేరిట బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. ఇక్కడి నుంచే కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. తుక్కుగూడ నుంచి దాదాపు 12 మంది బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ కండువ కప్పుకోనున్నారని ప్రచారం ఒకరేంజ్ లో జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Python Climb Tree: భారీ చెట్టును సెకన్లలో ఎక్కేసిన కొండ చిలువ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..


బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లోనే ఉన్నట్లు కూడా వార్తలు బైటికొచ్చాయి. ఈ నేపథ్యంలో జనజాతరకు వచ్చే కాంగ్రెస్ హైకమాండ్ నాయకుల ఆధ్వర్యంలో, వీరి చేరిక కూడా దాదాపు లాంఛనమైపోయిందని కూడా వార్తలు వెలువడ్డాయి. ఈక్రమంలోనే పార్టీ హైకమాండ్ సీఎం రేవంత్ కు ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ తుక్కుగూడ జనజాతర సభ తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారింది. తుక్కుగూడ సభలో 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే రాహుల్ గాంధీ, ఖర్గే హాజరవుతున్న సభలో ఎలాంటి చేరికలు లేవని తాజా సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఫిరాయింపులపై కాంగ్రెస్ హామీ ఇచ్చింది.


ప్రజా ప్రతినిధులు పార్టీ మారితే.. వెంటనే పదవి పోయేలా చట్ట సవరణ చేస్తామని ప్రకటించింది. దీంతో తుక్కుగూడ వేదికపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే జాతీయ స్థాయిలో ఇబ్బందులు వస్తాయని కాంగ్రెస్ పెద్దలు భావించారని తెలుస్తోంది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు ఆగిపోయాయని సమాచారం.


Read More: Telangana Congress: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. దానం, కడియంలకు కాంగ్రెస్ బిగ్ షాక్..


ఇక్క తుక్కుగూడ సభను సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దగ్గరుండి అధికారులతో సమన్వయంతో, హైకమాండ్ నాయకులు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఆదేశాలు జారీచేశారు. అదే విధంగా.. ఈ సభకు అన్ని లోక్ సభ, అసెంబ్లీ స్థానాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook