నిరుద్యోగులకు గుడ్ న్యూస్... పోస్టల్ సర్కిల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Jobs Notifications) విడుదలైంది. దీని ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎల్డీసీ(LTC), పోస్టల్ అసిస్టెంట్(Postal Assistant), సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్మ్యాన్/మెయిల్ గార్డ్ తదితర ఉద్యోగాల భర్తీ జరగనుంది. టెన్త్, ఇంటర్ పాసయితే చాలు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. మొత్తం ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఖాళీల్లో పోస్టల్ అసిస్టెంట్ 11, సార్టింగ్ అసిస్టెంట్ 8, పోస్ట్మ్యాన్/ మెయిల్గార్డ్ 26, ఎంటీఎస్ (MTS) 10 ఉన్నాయి. ఇందులో పోస్టల్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్మ్యాన్/మెయిల్ గార్డ్ పోస్టుకు కనీస ఉత్తీర్ణత ఇంటర్ కాగా, ఎంటీఎస్ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలంటే 10వ తరగతి పాసైతే చాలు. ఈ ఖాళీలన్నీ స్పోర్ట్స్ కోటాలో (Sports quota) పూర్తి చేయనున్నారు.


Also Read: Tokyo paralympics 2021: అదరగొట్టేసిన సుమిత్... భారత్‌కు మరో స్వర్ణం!


నిబంధనలు ఇవే!
ఈ పోస్టుల కోసం కొన్ని నిబంధనలు పొందుపరిచింది పోస్టల్ శాఖ.  పోస్ట్ మ్యాన్ జాబ్ (Postman jobs) కు అర్హత పొందితే రెండేళ్లలోగా టూ వీలర్, లైట్ మోటార్ వెహికిల్, త్రీ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే తెలంగాణలో పోస్టింగ్ కాబట్టి పోస్ట్మ్యాన్/మెయిల్గార్డ్, ఎంటీఎస్ కోసం దరఖాస్తు చేసే వారికి తెలుగు భాషపై పట్టుండాలి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ జరుగుతున్న కారణంగా సంబంధిత క్రీడల్లో అంతర్జాతీయ, జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. 


వయో పరిమితి
పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసేవారు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్ట్మ్యాన్/మెయిల్గార్డ్, ఎంటీఎస్కు దరఖాస్తు చేసే వారు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.


అప్లికేషన్ ప్రాసెస్ (Application Process), రిజర్వేషన్ ప్రకారం ఖాళీల వివరాలు, పూర్తి నిబంధనల కోసం అధికారిక సైట్ను చూడండి. https://tsposts.in/sportsrecruitment/


Also Read: Rbi New rules: బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక... ఈ నిబంధనలు మరచిపోతే ఫైన్ కట్టాల్సిందే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook