జూనియర్ సివిల్ జడ్జీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

Junior civil judges posts recruitment in AP: అమరావతి: రాష్ట్రంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉండగా.. అందులో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 18 పోస్టులు, బదిలీ విధానం ద్వారా మరో 4 పోస్టులు భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 31, 2021, 08:00 AM IST
జూనియర్ సివిల్ జడ్జీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

Junior civil judges posts recruitment in AP: అమరావతి: రాష్ట్రంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉండగా.. అందులో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 18 పోస్టులు, బదిలీ విధానం ద్వారా మరో 4 పోస్టులు భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. జూనియర్ సివిల్ జడ్జి పోస్టులకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 30వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

veterinary posts recruitment 2021: ఇదిలావుంటే, రాష్ట్ర పశు సంవర్థక శాఖ డైరెక్టరేట్‌లో ఇటీవల క్లాస్‌-డి కింద ఏర్పాటైన అడ్మిన్‌ జాయింట్‌ డైరెక్టర్‌, అడ్మిన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పోస్టులు సైతం భర్తీ చేసేందుకు శుక్రవారం ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. అడ్మిన్‌ జాయింట్ డైరెక్టర్ పోస్టుకు డిప్యూటీ డైరెక్టర్లను, డిప్యూటీ డైరెక్టర్ల పోస్టుల్లో ఏడీలను పదోన్నతిపై నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కార్యాలయ మేనేజర్‌ పోస్టుల్లో కింది స్థాయి ఉద్యోగులను పదోన్నతిపై డైరెక్టర్‌ నియమిస్తారని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. నియామకాల (veterinary recruitment in AP) కోసం పరిగణనలోకి తీసుకోవాల్సిన అర్హతల వివరాలను సైతం ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Trending News