హైదరాబాద్: కరోనావైరస్ మహమ్మారి బారిన పడకుండా జర్నలిస్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. సమాజహితం ఏదైనా చేయాలంటే ముందుగా ప్రాణాలతో ఉండాలని సూచిస్తూ.. పాత్రికేయులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరారు. జర్నలిస్టులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు శానిటైజర్లు ఉపయోగించాలని సూచించారు. ప్రాణం కన్నా విలువైంది ఏది లేదని చెబుతూ... సమాజం కన్నా ముందు మనపై ఆధారపడిన మన కుటుంబసభ్యులు ఉన్నారని, ఈ విషయాన్ని జర్నలిస్టులు గమనించాలని సూచించారు. ఢిల్లీలో శనివారం కరోనావైరస్ సోకిన  జర్నలిస్టుల కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. బాధితుల కుటుంబాలకు నిత్యావసరాలు, ఖర్చుల నిమిత్తం వారి బ్యాంకు ఖాతాలకు వెంటనే 20 వేల రూపాయలు జమ చేస్తున్నట్లు అల్లం నారాయణ తెలిపారు. బాధితులతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం తరపున అన్నివిధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Breaking: మే 17 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించిన కేంద్రం


గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో క్వారంటైన్‌లో ఉన్న జర్నలిస్టులకు కూడా 10 వేల రూపాయలను బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్ సోకిన ఢిల్లీ జర్నలిస్ట్ చికిత్సకు 10 టీవీ యాజమాన్యం లక్ష రూపాయలను ప్రకటించినందుకు అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..