Telangana Rain Updates: తెలంగాణలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రేపు ఉదయం 8.30 గంటల వరకు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ సిద్ధిపేట జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం... ఇవాళ రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. 


ఇక రేపు (సెప్టెంబర్ 12) ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక మంగళ, బుధ, గురు (సెప్టెంబర్ 13, 14, 15)వారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 


బంగాళాఖాతంలో వాయుగుండం :


బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఇది దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పయనించి క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.



Also Read: Krishnam Raju Death Live Updates: కృష్ణంరాజు కన్నుమూత.. రేపు అంత్యక్రియలు -లైవ్ అప్డేట్స్ 


Also Read: TATA EV Cars: టాటా నుంచి చీపెస్ట్ ఈవీ కారు వచ్చేస్తోంది.. అన్నింటి కన్నా ఇదే చీప్..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook