Singareni Results: సింగరేణిలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులకు శుభవార్త. సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు ఇలా చెక్ చేసుకోవాలి
తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల్లో ఉద్యోగాల కోసం ఇటీవల జరిగిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. వారం రోజు క్రితం సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకై రాత పరీక్ష జరిగింది. జేఎన్టీయూ నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాల్ని జేఎన్టీయూ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి, సింగరేణి డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్ ఫలితాల్ని విడుదల చేశారు.
సింగరేణిలో మొత్తం 177 పోస్టుల భర్తీకై రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 77 వేల 898 మంది ఈ రాత పరీక్షలో అర్హత సాధించారు. ఇందులో 49 వేల 328 మంది రాసిన మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు లేకపోవడంతో అందరికీ మార్కులు కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. మరో వారం రోజుల్లో ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితాను విడుదల చేయనున్నట్టు సింగరేణి సంస్థ వెల్లడించింది.
పరీక్ష ఫలితాల్ని సింగరేణి అధికారిక వెబ్‌సైట్ www.scclmines.comలో చూసుకోవచ్చు.
Also read: Bandi Sanjay: 4వ విడత బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర రూట్ మ్యాప్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook