Tata Motors Electric Vehicles: ప్రముఖ కార్ల తయారీ సంస్థ, దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఉత్పత్తిదారుగా ఉన్న టాటా మోటార్స్ నుంచి త్వరలోనే అతి తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ కారు లాంచ్ కానుంది. సుమారు రూ.10 లక్షల రేంజ్‌లో ఉండే ఎలక్ట్రిక్ కారును టాటా మోటార్స్ త్వరలోనే లాంచ్ చేయనుంది. ఇప్పటివరకూ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో ఇంత తక్కువ బడ్జెట్‌లో కార్లు అందుబాటులో లేవు. టాటా నుంచి ప్రస్తుతం రూ.12.49 లక్షలకు టాటా టిగర్, రూ.14.99 లక్షలకు టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి కన్నా మరింత చౌకగా రూ.10 లక్షల బడ్జెట్‌లో కొత్త కారును లాంచ్ చేయనుంది.
దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ రంగంలో టాటా మోటార్స్ మిగతా మాన్యుఫాక్చరర్స్ కన్నా చాలా ముందుంది. దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో ఈ కంపెనీ వాటా దాదాపు 88 శాతం. మిగతా 12 శాతం వాటా హ్యుందాయ్, ఎంజీ మోటార్స్ కలిగి ఉన్నాయి. టాటాకి చెందిన 40 వేల ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్నాయని టాటా మోటార్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు.రానున్న రోజుల్లో మొత్తం 10 కొత్త ఎలక్ట్రికల్ వెహికల్స్‌ను లాంచ్ చేయనున్నట్లు చెప్పారు.
తక్కువ బడ్జెట్ కార్ల తయారీకి పెట్టింది పేరైన మారుతి సుజుకీ సైతం రూ.10 లక్షల రేంజ్‌లో ఎలక్ట్రిక్ కారును తీసుకురాలేకపోతున్నట్లు ఇటీవల తెలిపింది. తమ కంపెనీ నుంచి తొలి ఎలక్ట్రిక్ వెహికల్‌ను 2025లో తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం టాటా మోటార్స్ నుంచి మాత్రమే తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి.ఎంజీ మోటార్స్ ఈవీ రూ.21.99 లక్షలు, హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కారు రూ.23.84 లక్షలు, కియా ఈవీ రూ.59.95 లక్షలు ఉన్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో టాటా మోటార్స్ 17,150 ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను విక్రయించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి మొత్తం 50 వేల ఎలక్ట్రికల్ వెహికల్స్ విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: అందుకే కృష్ణంరాజు మృతి.. అసలు విషయం చెప్పిన ఏఐజీ వైద్యులు
Also Read: Amit Shah to Meet Prabhas: కృష్ణంరాజు కుటుంబసభ్యులను పరామర్శించనున్న అమిత్ షా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook