Telanana Rain Updates: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉంది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్,పెద్దపల్లి,సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కొన్నిచోట్ల గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మరో 3, 4 రోజులు రాష్ట్రంలో తేలికపాటినుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం.. హైదరాబాద్‌లో ఇవాళ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు లేదా ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 22 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. 


ఏపీలోనూ వర్షాలు :


ఏపీలోనూ ఇవాళ కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విపత్తుల నిర్వహణ శాఖ ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో.. ఆ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. 


Also Read: Bihar Politics: నితీశ్ కుమార్ అడుగులు ఎటువైపు.. నేడు జేడీయూ కీలక సమావేశం.. ఇక బీజేపీతో తెగదెంపులేనా..?


Also Read:Horoscope Today August 9th : నేటి రాశి ఫలాలు.. ఈ రెండు రాశుల వారికి ఇవాళ అదృష్టం వెన్నంటే ఉంటుంది..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3P2DgvH


Apple Link - https://apple.co/3df6gDq


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook