Telangana Rains: ఇద్దరి ప్రాణం తీసిన పిడుగులు.. తెలంగాణలో భయంకరంగా అకాల వర్షాలు
Heavy Rains In Telangana Two Died Effect Of Thunderstorm In Sircilla: తెలంగాణలో మరోసారి అకాల వర్షం బీభత్సం సృష్టించింది. గాలివాన ఉరుములు మెరుపులకు తోడు పిడుగులు పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇద్దరు మృతి చెందారు.
Telangana Rains: వేసవికాలంలో అకాల వర్షాలు తెలంగాణలో కకావికలం చేస్తున్నాయి. కొన్ని రోజుల కిందట కురిసిన భారీ వర్షంతో తీవ్ర ఆస్తి ప్రాణ నష్టం సంభవించగా మరోసారి అకాల వర్షం బీభత్సం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాలివానకు తోడు ఉరుములు మెరుపులతో పరిస్థితి భయంకరంగా మారింది. కొన్ని చోట్ల పిడుగులు పడడంతో ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం సంభవించింది.
Also Read: Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్.. నిలిచిపోయిన వాహనాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుతో ఇద్దరు మృతి చెందారు. తంగలపల్లి మండలం ఇందిరానగర్ గ్రామంలోని భరత్ నగర్‌కుద చెందిన రుద్రారపు చంద్రయ్య అనే రైతు తన పొలం వద్ద గురువారం పొలం పనులు చేసుకుంటున్నాడు. అకస్మాత్తుగా వర్షంతోపాటు ఉరుములు మెరుపులు వచ్చాయి. వర్షం నుంచి తడవకుండ చెట్టు వద్దకు వెళ్తుండగా అకస్మాత్తుగా పిడుగు పడింది. పిడుగుపాటుకు చంద్రయ్య అక్కడిక్కడే మృతి చెందాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజ్ పల్లిలో పిడుగుపాటుతో కంబల్ల శ్రీనివాస్ (30) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ పిడుగుపాటుకు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు, గ్రామస్తులు స్పందించి హుటాహుటిన వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
సంగారెడ్డి, మెదక్ జిల్లాలో పలు చోట్ల వర్షం కురిసింది. సంగారెడ్డి, వట్‌పల్లి, కోహిర్ మండలాల్లో జోరు వర్షం కురిసింది. వర్షానికి కోతకు వచ్చిన మామిడికాయలు రాలిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయని రేవంత్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్, పాపన్నపేట మండలాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఇక కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. పట్టణంలోని మహేశ్వరి థియేటర్ కాంపౌండ్ వాల్ వద్ద ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగుపడింది. పిడుగుపాటుతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి