Telangana records 2,447 new cases of Covid-19 : తెలంగాణలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 80,138 కొవిడ్ టెస్ట్‌లు (Covid Tests) నిర్వహించగ కొత్తగా 2,447 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో (Telangana) మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,11,656కు చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తెలంగాణలో గత 24 గంటల వ్యవధిలో కొవిడ్ (Covid) వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా (Corona) వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,060కి చేరింది. ఇక కొవిడ్ నుంచి తాజాగా 2,295 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 22,197 కొవిడ్ యాక్టివ్‌ కేసులు (Covid Active‌ Cases) ఉన్నాయి. 


ఇదిఇలా ఉండగా తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు (High Court) విచారణ చేపట్టింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలంటూ తెలంగాణ సర్కార్‌‌ను (Telangana Government ) హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు (RTPCR tests) చేయాలంటూ తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 


ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ పరీక్షల (Rapid tests) వివరాలు వేర్వేరుగా ఇవ్వాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అలాగే సోషల్ డిస్టెన్స్‌, మాస్కుల నిబంధనలను రాష్ట్రంలో కచ్చితంగా అమలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని హైకోర్టు సూచించింది.


Also Read : Hyderabad: గాంధీ, ఎర్రగడ్డ ఆస్పత్రుల్లో కరోనా కలకలం


కాగా కరోనా నియంత్రణపై కేబినెట్ల చర్చిస్తున్నట్లు ఏజీ వెల్లడించగా... పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ కేసులపై (Covid cases) విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది హైకోర్టు.


Also Read : Delhi: ఢిల్లీ జైళ్లలో కరోనా విజృంభణ.. ఎన్ని కేసులంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook